అన్ని దానాల్లో కెల్లా అన్నదానం గొప్పది..
ట్రాఫిక్ సిఐ జి.బాబూలాల్
వరంగల్ ఈస్ట్, జూన్ 29(జనం సాక్షి):
సమాజంలో లో అన్ని దానాల్లో కెల్లా అన్నదానం గొప్పదని.. ప్రతీ నెల పౌర్ణమి, అమావాస్య వేళల్లో అన్నదానం చేస్తున్న ధరణీ సాయి సభ్యుల తీరు అభినందనీయమని వరంగల్ ట్రాఫిక్ సిఐ జి.బాబూలాల్ అన్నారు. బుధవారం అమావాస్య సందర్భంగా వరంగల్ ఎంజిఎం ఆసుపత్రిలోని రోగులకు, వారి బంధువులకు డిఎస్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని సిఐ బాబూలాల్ ప్రారంభించారు. అనంతరం సిఐ మాట్లాడుతూ ఎంజిఎం ఆసుపత్రిలో అన్నదానంతో పాటు అనాధాశ్రమల్లో అన్నదానం చేస్తూ ప్రతి శుక్రవారం గోసేవలో తరిస్తున్న ధరణీ సాయి సేవాసంఘ్ సభ్యుల సేవానిరతిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ధరణీ సాయి సభ్యులు జి.సుధాకర్, ఆర్.హరిప్రసాద్, డి.పూర్ణచందర్, వెంకన్న, శంకర్, రవీందర్, ప్రవీణ్, విక్రమ్, సురేష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.