అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న.
మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీప నర్సింలు.
తాండూరు అక్టోబర్ 9(జనంసాక్షి) అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అని మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీప నర్సింలు పేర్కొన్నారు.
శనివారం వికారాబాద్ జిల్లాతాండూరు పట్టణం 14వ వార్డ్ మణిక్ నగర్ లో మెతరి సమాజం ఆధ్వర్యంలో నవరాత్రి ముగింపు పౌర్ణమి సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్ర మంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీప నర్సింలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం సంతోషకరమన్నారు.అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు. ఈ కార్యక్రమంలో
మేతరి సమాజం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.