అన్ని పార్టీలూ అవినీతి అజెండాతో కుమ్మక్కయ్యాయి: లోక్‌సత్తా

హైదరాబాద్‌, జనంసాక్షి: రాష్ట్రంలో ప్రస్తుతం వివిధ పార్టీల మధ్య నెలకొన్న కుమ్మక్కు ఆరోపణలపై లోక్‌సత్తా పార్టీ స్పందించింది. ఎవరు ఎవరితో కుమ్మ్కయ్యారన్నది పక్కన బెడితే అన్ని పార్టీలు అవినీతి అజెండాతో కుమ్మక్కయినట్లు అర్ధమవుతుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కటారి శ్రీనివాసరావు ఆరోపించారు. ప్రతి ఒక్కరూ వ్యక్తుల లక్ష్యంగా ఆరోపణలు గుప్పిస్తున్నారే తప్ప వ్యవస్థలో మార్పు కోరుకోవడం లేదని ఆయన ఆక్షేపించారు, సీబీఐకి స్వతంత్ర ప్రతిపత్తి సహా పలు అంశాలపై గతంలోనే స్పందించి ఉంటే ఇప్పుడీ పరిస్థితి దాపురించేది కాదన్నారు. ఇప్పటికైనా బలమైన లోక్‌పాల్‌. లోకాయుక్తా వ్యవస్థకు మద్దతివ్యడం ద్వారా అవినీతి నిర్మూలనకు సహకరించాలని ఆయన పార్టీల్ని కోరారు.