అన్ని వర్గాల అభివృద్దే ప్రభుత్వ ధ్యేయం
జహీరాబాద్ ఆగస్టు 27 ( జనం సాక్షి ) అన్ని వర్గాల ప్రజల సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు అన్నారు. శనివారం మొగుడం పల్లి మండలం లోని సజ్జపూర్ ఇప్పేపల్లి,గ్రామంలో నూతన ఆసరా పింఛను కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 57 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఆసరా పెన్షన్ అందిస్తున్న ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు. వ్యవసాయం కోసం 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తున్నాం. సాగు పెట్టుబడి కోసం రైతుబంధు ఇస్తున్నామని తెలిపారు.గతంలో ఎరువుల కోసం రైతన్నలు లాటి దెబ్బలు తిన్న పరిస్థితులు కానీ స్వయం పాలనలో రైతన్నలకు ఎరువుల సమస్య లేకుండా పోయిందని,రైతులు పండించిన ధాన్యం కొనుగోలు కోసం ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు.తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలతో రైతులతో పాటు తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు.గత కాంగ్రెస్ పాలనలో 75 రూపాయల పెన్షన్ ఇచ్చేవారుకొత్తగా పెన్షన్ కావాలంటే మరొకరి చావు కోసం ఎదురు చూడాల్సిన ఉండేదన్నారు. నూతన పెన్షన్లను సైతం వచ్చే నెల నుండి మీ మీ బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తాం అన్నారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసి మోహన్ రెడ్డి, ఆత్మ కమిటీ ఛైర్మెన్ పెంటారెడ్డీ, టీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డీ, సర్పంచులు చందర్ నాయక్, ఈశ్వర్ రెడ్డి, సురేష్, హబ్సి రాజు, ఎంపీటీసీ లు, గ్రామ అద్యక్షులు, టిఆర్ఎస్ నాయకులు ఇజ్రాయేల్ బాబీ, సంజు, మల్కాపురం ప్రభు, అశోక్ రెడ్డీ, గొల్ల మల్లన్న, నగి రెడ్డీ, సూరన్న, శంకర్, కంత దొర, డిప్యూటీ శ్రీకాంత్, వార్డు మెంబర్ ఫిరోజ్, వీరేశం, పార్టీ అధ్యక్షులు బస్వరజ్, మాజీ సర్పంచ్ వీర్షెట్టీ, డిప్యూటీ సర్పంచ్ చంద్రప్ప, చైర్మన్ చంద్రకాంత్, దేవాయ, ముర్శీడ్ సబ్, బస్వా స్వామీ, నగ్షెట్టీ, కిష్టప్ప, శెట్టి, యోహన్, మహిపాల్, రాహుల్ ,సర్పంచులు ఎంపిటిసిలు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.