అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందించడమే సీఎం కేసీఆర్ లక్ష్యం

ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ

టేకులపల్లి, సెప్టెంబర్ 2 (జనం సాక్షి):  అన్ని వర్గాల పేదలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందించడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్మని ఇల్లందు శాసన సభ్యురాలు బానోత్ హరిప్రియ నాయక్ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గ పరిధిలో శాసన సభ్యురాలు బానోతు హరిప్రియ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఆసరా పెన్షన్లు గుర్తింపు కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేయడానికి శుక్రవారం విస్తృతంగా పర్యటించారు. అందులో భాగంగా టేగులపల్లి మండలంలోని మార్కెట్ యార్డు నందు 1509 మంది ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో టిఆర్ఎస్ ప్రభుత్వం మాట తప్పదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. పింఛన్ లు మంజూరుతో మరోసారి చేతల ప్రభుత్వమని రుజువైందని పేర్కొన్నారు. కరోనాకాలంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఆలస్యంగా నైనా ఇచ్చిన మాటను నిలబెట్టుకొనుటకు ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో 46 లక్షల మందికి పెన్షన్లు అందిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో సర్వ మతాలను సమానంగా చూడడంతో ప్రజలందరూ కలిసిమెలిసి జీవిస్తున్నారని అన్నారు. ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వలేనటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి దేశంలోనే ఏకైక ముఖ్యమంత్రిగా నిలిచారని అన్నారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహి లు, బీడీ కార్మికులు గీత కార్మికులు, ప్రభుత్వం ప్రతినెల ఆసరా పెన్షన్లు అందిస్తున్న ఘనత దివ్యాంగులకు నెలకు రూ.3016 వృద్ధులు వితంతువులకు, ఇతర కేటగిరీల వారికి రూ.2016 చొప్పున అందిస్తున్నారని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని వర్గాల ప్రజలు అండగా నిలుస్తున్నారని తెలిపారు. సీఎం కెసిఆర్ ని నిండు మనసుతో ఆశీర్వదించాలని ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రజలందరినీ కోరారు. ప్రజలకు ఇచ్చిన మాటపై నిలబడే నాయకుడు సీఎం కేసీఆర్ పాలనలో పనిచేయడం సంతోషం ఉందన్నన్నారు. ఎమ్మెల్యేగా తనకిచ్చిన ఈ అవకాశాన్ని మీ అందరికీ ఉపయోగపడే విధంగా అభివృద్ధి కార్యక్రమాల కోసం పాటుపడతానని త్వరలోనే ప్రతి మీ ఇంటికి వస్తానని అన్నారు.
పేదల అభ్యున్నతికి సంక్షేమ పథకాలను చేయడంతో పాటు వారి ఆత్మగౌరవం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్  కృషి చేస్తున్నారని అన్నారు.  గతంలో ఇచ్చిన మాట ప్రకారం 57 ఏండ్లు నిండిన వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వితంతువులు నూతన పెన్షన్లు మంజూరు చేసిన ఘనత సీఎం కేసీఆర్ గారి కే దక్కుతున్నది అన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య మాట్లాడుతూ రాజకీయాల కతీతంగా అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి సంక్షేమ పథకాలను అందిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, ఎంపీపీ భూక్య రాధా, టేకులపల్లి ఎంపీడీవో డి బాలరాజు, ఎంపీటీసీలు ,సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, పలు శాఖల అధికారులు ,టిఆర్ఎస్ పార్టీ నాయకులు, పింఛన్ లబ్ధిదారులు పాల్గొన్నారు

.