అన్ని సంక్షేమ పథాకాలకు ఆధార్ తప్పనిసరికాదు
న్యూఢిల్లీ,ఆగస్టు 11(జనంసాక్షి):
అన్నింటికీ ఆధార్‌కార్డు తప్పనిసరికాదని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రజా పంపిణీ, గ్యాస్ రాయితీ లాంటి వాటికి మాత్రమే ఆధార్ కార్డు తప్పనిసరి అని పేర్కొంది. ఆధార్‌లో పేర్కొన్న వ్యక్తిగత సమాచారం ఎవరికీ ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా తెలిపింది. ఆధార్ తప్పని సరికాదని పత్రికలు, టీవీల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని ఈ సందర్భంగా కేంద్రానికి సూచించింది.అయితే సంక్షేమ పథకాలను అందించేందుకు ప్రజాపంపిణీ, గ్యాస్ రాయితీలకు ఆధార్ తప్పనిసరని పేర్కొంది. ఎవరికి రాయితీ ఇవ్వాలో తెలుసుకునే క్రమంలో ఇది తప్పనిసరని పేర్కొంది. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు ఆధార్ తప్పనిసరికాదు ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. ఆధార్ దేనికి అవసరమో కాదో ఇక సుప్రీం ఆదేశాలతో విస్తృత ప్రచారం చేయాల్సి ఉంటుంది.