అపరిచితుని వలలో మోసపోయిన పలువూరు..

అపరిచితుని వలలో మోసపోయిన ఘటన బై0సా పట్టణంలో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం పూర్తి వివరాల్లోకి వెళ్తే…బుధువారం మధ్యాహ్నం బై0సా పట్టణం నిర్మల్ చౌరస్తా కి వచ్చిన ఓ అపరిచితుడు మిషన్ భగీరథ ఆఫీసర్ నని ఆటోను అపి 500 రూపాయలకు ఆటో ఎంగేజ్ మాట్లాడుకున్నాడు. ఆటో డ్రైవర్ తో బాసర నుండి డస్ట్ తీసుకోనిరావడానికి ట్రాక్టర్లు అద్దె కి కావాలని తెలుపగా, ఆటో డ్రైవర్ అద్దె ట్రాక్టర్ల దొరికే పలుచోట్లకు తీసుకెళ్లడు. ఎక్కడ బేరం కుదరక పొగా,చివరకు బై0సా మండలం దేగా0గ్రామ0వెళ్లి, బేరం కుదుర్చుకొని బాసర నుండి బైంసా మిషన్ భగీరథ వద్ద డస్ట్ ని డంపు చేయాలని దాదాపు మూడు రోజులు ఈ పని ఉంటుందని 10 ట్రాక్టర్లను అద్దెకు మాట్లాడారు. మాట్లాడిన 10 ట్రాక్టర్లను బైంసాలోని ఓ పెట్రోల్ పంపు కి తీసుకువచ్చి అన్ని ట్రాక్టర్లో మరియు మూడు రోజులకు సరిపోయే విధంగా డబ్బాలలో డీజిల్ నింపగా వాటి డీజిల్ బిల్లు దాదాపు ఒక లక్ష రూపాల పైనే దాటింది.ట్రాక్టర్ డ్రైవర్ బాబులతో మీకైతే డీజిల్ లీటర్ 100 రూపాయలు పడుతుందని,అదే నాకు కంపెనీ నుండి లీటర్ డీజిల్ కు 30 రూపాయలు వస్తాయని పేర్కొన్నాడు. ఇది నమ్మిన  డ్రైవర్స్ లీటరుకు 70 రూపాయల చొప్పున 10 ట్రాక్టర్లలో, డబ్బాలలో కొట్టిన  డీజిల్ కి డబ్బులు ఆపరిచితునికి దాదాపు 80 వేల రూపాయలు ముట్ట చెప్పారు. మొత్తం డీజిల్ బిల్లు లక్ష పదివేలు పెట్రోల్ పంపువానికి చెల్లించాల్సి ఉండగా, డ్రైవర్స్ నుండి కలెక్ట్ చేసిన 80 వేయిల కి 30 వేల రూపాయలు మా అధికారి వద్ద నుండి తీసుకొస్తానని, ప్రస్తుతం అతను బస్ స్టాండ్ సమీపం లోని మెస్ లో భోజన0 చేస్తున్నాడని తెలిపాడు. నమ్మకం లేకుంటే చెక్ తీసుకోండి అంటూ సంతకం లేని చెక్ ఇచ్చాడు. అప్పటికి నమ్మకం లేకుంటే మీ వర్కర్ ఒకరిని నాతోపంపియండి అంటూ తెలిపగా,పంపు ఇన్చార్జి ద్విచక్ర వాహనాన్ని ఇచ్చి,వర్కర్ ని ఇచ్చి ఆ అపరిచితునితో పంపివ్వగా మెస్ వరకి వెళ్లిన ఆ వర్కర్ ని అపరిచితుడు మెస్ మెట్లు ఎక్కే క్రమంలో బురిడీ కొట్టించి తప్పించుకున్నాడు. దీంతో అప్పటికి కాని తెలియలేదు బిల్డప్ బాబాయ్ గా వచ్చి, బిల్డప్ ఇచ్చి అందర్నీ మోస0 చేశాడని, వెంటనే బాధితులందరూ పట్టణ పోలీసు స్టేషన్ కి వెళ్ళి ఫిర్యాదు చేద్దామని వెళ్లారు.