అపోలో ఆస్పత్రిలో స్వైన్‌ఫ్లూతో వ్యక్తి మృతి

narsimhulu killed by swine flu

హైదరాబాద్ : రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇవాళ అపోలో ఆస్పత్రిలో స్వైన్‌ఫ్లూతో ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు మెదక్ జిల్లా సంగారెడ్డికి చెందిన నర్సింహులు. పుల్కల్‌లో అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్‌గా నర్సింహులు పని చేస్తున్నారు. నిన్న స్వైన్‌ఫ్లూతో గర్భిణి మృతి చెందిన విషయం తెలిసిందే. స్వైన్‌ఫ్లూ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు.