అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య
కృతి వైపరీత్యాల వల్ల ఓవైపు పంటలు పండక మరోవైపు పంటల సాగుకై చేసిన అప్పలు తీర్చే మార్గం కనిపించక ఓ యువ రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన సిద్ధిపేట జిల్లా జగదేవ్ పూర్ మండల పరిధిలోని రాయవరం గ్రామంలో బుధవారం రాత్రి 11గంటల సమయంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాయవరం గ్రామానికి చెందిన ఆతుకూరి సత్తయ్య(29) తనకున్న ఎకరం పొలంతో పాటు, మరో అర ఎకరం భూమిని కౌలుకు తీసుకొని పత్తి పంటను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వర్షాబావ పరిస్థితుల వల్ల గత ఐదేళ్లుగా పంటలకు వరుసగా నష్టం వాటిల్లింది. పంటల పెట్టుబడి కోసం, కుటుంబ పోషణ కోసం చేసిన అప్పులు రూ.3లక్షల వరకు అయ్యాయి. ప్రస్తుతం సాగుచేసిన పత్తిపంట కూడా అధిక వర్షాల వల్ల పూర్తిగా ఎర్రబడడంతో సత్తయ్య తీవ్ర మనోవేదనకు గురై బుధవారం రాత్రి 11 గంటల సమయంలో ఇంట్లో వారందరూ నిద్రించిన తర్వాత పురుగుల మందు తాగాడు. అనంతరం ఇంటి బయటకు వచ్చి వాంతులు చేసుకుంటుండగా ఇరుగుపొరుగు వారు గమనించి కుటుంబ సభ్యులకు చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం అతడిని అంబులెన్స్ లో గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆసుపత్రిలో బుధవారం రాత్రి రైతు సత్తయ్య మృతి చెందినట్లు గ్రామస్తులు వివరించారు. కాగా మృతునికి భార్యతో పాటు 9 సంవత్సరాల వయస్సు లోపు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం స్పందించి మృతుడి కుటుంబ సభ్యులను అన్ని విధాలుగా ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు .