అప్పుల బాధతో రైతు అత్మహత్య

కుంటాల: మండలంలోని ఓల గ్రామానికి చెందిన చెండాల భూమయ్య (35) అనే రైతు అప్పుల
బాధతో ఉరివేసుకుని అత్మహత్యకు పాల్పడ్డాడు. తనకున్న రెండెకరాలతో పాటు మరో నాలుగెకరాలు
కౌలుకు పత్తిపంట సాగుచేశాడు. వర్షాభావ పరిస్థితులతో పంట దెబ్బతింది. దాదాపు లక్ష రూపాయల మేర అప్పులు పేరుకుపోయాయి.అప్పుల తీర్చేమార్గంలేక జీవితంపై విరక్తితో అత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబీకులు పెర్కోన్నారు.పోలిసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.