అఫ్ఘాన్‌ పరిణామాలపై మలాల ఆందోళన

అక్కడి ప్రజలకు ప్రపంచం అండగా ఉండాలని వినతి
లండన్‌,ఆగస్ట్‌17(జనంసాక్షి): అప్గనిస్తాన్‌లో తాలిబన్లు అధికారం చేజి క్కించు కోవడంపై పాకిస్తానీ హక్కుల కార్యకర్త, నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్‌ (24) ఆందోళన వ్యక్తం చేశారు. ఆ దేశంలోని మహిళలు, మైనారిటీలు హక్కుల కార్యకర్తల రక్షణపై తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు ఆమె తెలిపారు. అప్గనిస్తాన్‌ను తాలిబన్లు సంపూర్ణంగా స్వాధీనం చేసుకోవడం చూసి షాక్‌కు గురయ్యానని ట్విట్‌టర్‌ వేదికగా తెలిపారు. ఈ పరిస్థితుల్లో అక్కడి మహిళలు, మైనారిటీలు, హక్కుల కార్యకర్తల రక్షణపై తీవ్ర ఆందోళన చెందుతున్నానని అన్నారు. ప్రపంచదేశాలు జోక్యం చేసుకుని అక్కడ తక్షణమే కాల్పుల
విరమణ అమలయ్యేలా చూడాలన్నారు. శరణార్ధులు, పౌరులకు భద్రత కల్పించి, మానవతాసాయం అందజేయాలి’ అని ఆమె కోరారు. బాలికలు చదువుకోవాలంటూ పాక్‌లోని స్వాత్‌ ప్రాంతం లో ఉద్యమం చేపట్టిన మలాలాపై 2012లో తాలి బన్లు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఆమె పాకిస్తాన్‌లో, అనంతరం యూకేలో చికిత్స పొందారు. ప్రస్తుతం యూకేలోనే ఉంటున్నారు. ఆమె పాకిస్తాన్‌ వస్తే చంపేస్తామంటూ తాలిబన్లు హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. తాలిబన్‌ వశమైన అప్గనిస్తాన్‌లో స్థిరమైన పాలన ఏర్పడాలంటూ ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీమ్‌ రైజీ ఆకాంక్షించారు. అప్గన్‌లో స్థిరత్వం ఏర్పడేందుకు ఇరాన్‌ సహకరిస్తుందని, అదే తమ ప్రధమ ప్రాధాన్యమని పేర్కొన్నారు. అప్గన్‌ తమకు సోదరుడి వంటిదన్నారు. అమెరికన్‌ ఆర్మీ వైఫల్యం కావడంతోనే అఎª`గాన్‌ను విడిచి వెళ్లిందని వ్యాఖ్యానించారు. అమెరికా బలగాల నిష్కమ్రణ వల్ల అప్గన్‌కు తిరిగి జీవం పోసేందుకు, స్థిరమైన శాంతిని నెలకొల్పేందుకు అవకాశం దక్కిందన్నారు. అధికారికంగా 8 లక్షల మంది, అనధికారికంగా 20 లక్షల మంది అప్గన్లు ఇరాన్‌లో శరణార్థులుగా ఉన్నారు.

తాజావార్తలు