అబార్షన్ చేయించుకోమని వేధించేవాడు: సయరా భానో

హైదరాబాద్: ముస్లిం రుషుడు మూడుసార్లు తలాఖ్ చెప్పి విడాకులు తీసుకునే అవకాశం ఉన్న ముస్లిం పర్సనల్ లాను సవాలు చేస్తూ ఉత్తరాఖండ్‌కు చెందిన సయరా భానో అనే ముస్లిం మహిళ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తలాఖ్ విధానం రాజ్యాంగ విరుద్దమని తీర్పు చెప్పాలని ఆమె పిటిషన్‌లో కోరారు. ఈ విషయమై సయరా భానో మాట్లాడుతూ తన ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త తనకు గర్భ నిరోధక మాత్రలు ఇచ్చి అబార్షన్ చేయించుకోమని ఎన్నోసార్లు మానసికంగా, శారీరకంగా వేధించాడని తెలిపారు. అక్టోబర్ 15న తనకు మూడుసార్లు తలాఖ్ చెప్పాడని వివరించారు.

తాను దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు ఇవ్వబోయే తీర్పుతో భవిష్యత్ ముస్లిం మహిళలు ఇలాంటి దోపిడికి గురికాబోరని తాను భావిస్తున్నానన్నారు. సుప్రీంకోర్టులో తనకు తప్పకుండా న్యాయం జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. కాగా, దీనిపై సరియైన నిర్ణయం తీసుకోవాలని పేర్కొంటూ సుప్రీంకోర్టు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆరు వారాల గడువు ఇచ్చింది.