అబ్దుల్ కలాం గొప్ప స్నేహశీలి
– కలాం అవిశ్రాంత శాస్త్రవేత్త
– హరికిషన్
హైదరాబాద్,ఆగష్టు 9(జనంసాక్షి): అబ్దుల్‌కలాం అత్యంత స్నేహశీలి, ప్రజా రాష్ట్రపతి అని బ్రహ్మ విహారీ స్వామిజీ కొనియాడారు. ఆదివారం రామోజీఫిల్మ్‌సిటీలో మాజీ రాష్ట్రపతి దివంగత కలాం రాసిన ‘ట్రాన్సెన్‌డెన్స్’ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ.. అబ్దుల్ కలాం, ప్రమ్షుా స్వామీజీ మధ్య మంచి సాన్నిహిత్యం ఉందన్నారు. స్వామీజీలతో కలాం 7సార్లు సమావేశమయ్యారని, 2020 నాటికి భారత్ సమగ్రాభివృద్ధిపై కలాం ఎన్నో కలలు కన్నారని పేర్కొన్నారు. చిత్తశుద్ధి కలిగిన నాయకులు, అధికారులు, ప్రజలు కలిస్తేనే దేశాభివృద్ధి సాధ్యమని కలాం అనేవారని స్వామీజీ వివరించారు. కలాం, ప్రమ్షుా స్వామీజీల స్నేహం ఎంతో ఉన్నతమైనదని, ఒక్కమాట మాట్లాడలేకపోయినా పరస్పర భావాలను అర్థం చేసుకునే సాన్నిహిత్యం ఇద్దరి మధ్య ఉందని స్వామీజీ అన్నారు.
కలాం వల్లే నేను ఉన్నతస్థాయికి ఎదిగా: ఆచార్య అరుణ్ తివారీ
హైదరాబాద్: సామాన్యుడినైన తాను కలాం వల్లే ఉన్నతస్థాయికి ఎదిగానని ఆచార్య అరుణ్ తివారీ అన్నారు. మాజీ రాష్ట్రపతి దివంగత కలాం రాసిన ‘ట్రాన్సెన్‌డెన్స్’ పుస్తకావిష్కరణ కార్యక్రమం సందర్భంగా అరుణ్ తివారీ మాట్లాడుతూ.. కలాంతో పాటు ఆయన రచనల్లో పాలుపంచుకున్నానన్నారు. కలాం జీవిత చరిత్ర రాయటం ప్రారంభించినప్పుడు కలం ముందుకు సాగేది కాదని, ఆ సమయంలో కలాం తనని వెన్ను తట్టి ప్రోత్సహించారని తివారీ పేర్కొన్నారు.