అబ్దుల్ కలాం జాతీయ అవార్డు అందుకున్న ఉపాధ్యాయుడు గజ్జెల సుమన్.

అబ్దుల్ కలాం జాతీయ అవార్డు అందుకున్న ఉపాధ్యాయుడు గజ్జెల సుమన్.

ఏటూరునాగారం,
అక్టోబర్16(జనంసాక్షి).
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకొని హన్మకొండ నయీంనగర్ లోని, అరోమా హాల్లో వెనిశెట్టి జగదీశ్వరయ్య స్మారక సేవా సమితి ఆధ్వర్యంలో జాతీయస్థాయిలో వివిధ రాష్ట్రాల్లో విద్యారంగంలో, వివిధ రంగాల్లో ప్రతిభావంతులను గుర్తించి నిర్వహించిన జాతీయ స్థాయి అబ్దుల్ కలాం టీచింగ్ ఎక్సలెన్స్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఏటూరునాగారంకు చెందిన హనుమకొండలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల, రంగంపేటలో ప్రభుత్వ ఉపాధ్యాయుడుగా పని చేస్తున్న సామాజిక సేవకుడు, బ్లడ్ డోనర్ మరియు మోటివేటర్ గజ్జెల సుమన్ కు నేషనల్ టీచింగ్ ఎక్సలెన్స్ అవార్డు అందించడం జరిగినది.
ఈ అవార్డును ఉమ్మడి జిల్లా జడ్జి వై సత్యేంద్ర, సీనియర్ సూపరిండెంట్ ఆఫ్ సిఎస్ సిసి కోర్టు-హైదరాబాద్ శ్రీమతి అంజని కుమారి, ఫౌండేషన్ చైర్మన్ వెనిశెట్టి రవికుమార్, అవోపా జిల్లా గవర్నర్ ల ద్వారా ఇవ్వడం జరిగింది. గజ్జెల సుమన్ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విద్యా రంగంలో విశిష్ట సేవలు అందిస్తూనే, ఇప్పటివరకు 17 సార్లు రక్తదానం చేయడంతో పాటు అనేక సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తూ, వివిధ రంగాల్లో రాణిస్తూ ఉన్నందున ప్రశంసా పత్రం, శాలువా మరియు అవార్డుతో సన్మానించి వారి సేవలను కొనియాడారు. ఈ సందర్బంగా గజ్జెల సుమన్ ను ఉపాధ్యాయులు, సామాజిక కార్యకర్తలు, సన్నిహితులు శుభాకాంక్షలు తెలియజేశారు