అభియోగాలు నిరూపిస్తే పదవి నుంచీ తప్పుకుంటా

సంగారెడ్డి,మార్చి9  :  తనపై మోపిన అభియోగాలు నిరూపిస్తే పదవి నుంచి స్వచ్ఛందంగా వైదొలగుతానని, అభియోగాలు నిరూపించకపోతే అవిశ్వాస తీర్మానాలని వెనక్కి తీసుకుంటారా అని తెరాసకు చెందిన డీసీసీబీ అధ్యక్షుడు జయపాల్‌రెడ్డి సవాలు చేశాడు. సోమవారం డీసీసీబీ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. తనను రాజకీయంగా దెబ్బతీయాలన్న కుట్రతోనే అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారని ఆరోపించారు. 2007లో తాను అధ్యక్షుడుగా లేని సమయంలో విడుదల అయిన నిధుల్లో అవినీతి జరిగిందంటూ నోటీసులో పేర్కొనడం వారి అవివేకానికి నిదర్శనం అన్నారు. రాజకీయాలంటే ప్రజల్లో దురభిప్రాయం ఉందని, తెరాస చర్యల వల్ల అది మరింత దిగజారుతోందని పేర్కొన్నారు