అభివృద్దికి దూరంగా ఎమ్మెల్యే దత్తత గ్రామం

ఎవరూ పట్టించుకోవడం లేదన్న గ్రామస్థులు

కొత్తగూడెం,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న దంతేలబోర గ్రామ పంచాయతీని ఎమ్మెల్యే జలగం వెంకట్రావు దత్తత తీసుకున్నా భలాభం లేకుండా పోయిందని స్థానిక గ్రామప్రజలు ఆరోపిస్తు న్నారు ఏళ్ళు గడుస్తున్నాయి సమస్యలు పెరిగి తిష్ఠవేశాయయని, ఇంత వరకు ఎమ్మెల్యే దంతేల బోర గ్రామం ముఖం చూడలేదన్నారు. నాలుగేళ్ళ క్రితం దత్తత గ్రామాల స్వీకరణను ప్రతిష్టాత్మక కార్యక్రమంగా ప్రభుత్వం చేపట్టింది. పాల్వంచ మండలం దంతేలబోర గ్రామ పంచాయితీని నాలుగు సంవత్సరాల క్రితం కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావు దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. పంచాయతీని సకల సౌకర్యాలు ఏర్పాటు చేసి, నియోజకవర్గంలోనే మోడల్‌ గ్రామ పంచాయితీగా తీర్చి దిద్దుతానని నాడు ఆ పంచాయతీ ప్రజలకు ఇచ్చారు. అయితే గ్రామంలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేదాఆన్నారు. తెలంగాణ రాష్ట్రంఏర్పడినతరువాత రాష్ట్రంలో ఉన్న అసంబ్లీ నియోజకవర్గాలలో అభివృద్ధికి అత్యధికంగా నిధులు రాబట్టిన ఎమ్మెల్యేగా పేరొందిన కొత్తగూడెంఎమ్మెల్యే జలగం వెంకట్రావ్‌ గత కొంతకాలంగా నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు నత్తనడకే నయంగా నడుస్తున్నాయి పదవీకాలం పూర్తి కావస్తున్నా ఆ ప్రజలకు ఇచ్చిన హావిూ నాటికి నేటికి తేడా లేకుండా ఉండి పోయింది పేరుకే రహదారులు వర్షం పడితే ఆ రహదారులపై నడవాలంటే వరిపోలాలే నయం అనిపిస్తుంది,మెయిన్‌ రోడ్డు పక్క డ్రైనేజీలు రోడ్డుకి డ్రైనేజిలకు తేడాలు లేకుండా ఉన్నాయి మట్టిలో పూడి పోయాయి,అసలైన ప్రధాన సమస్య త్రాగునీరు బురదనీటికి బోరు నీటికి పెద్ద తేడా ఏవిూలేదు ఒకవైపు కిన్నెరసానివాగు మరోవైపు నిండు గోదావరి కానీ త్రాగేందుకు గుక్కెడు నీళ్లు కరువు. కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న పాఠశాల తరగతులు జరుగుతున్న సమయంలో పెచ్చులు ఊడి విద్యార్థులపై పడుతున్నాయి. దీంతో విద్యార్థులు బిక్కుబిక్కు మంటూ గడుపుతున్నారు. ఇక కరెంట్‌ సరఫరా మరీ అధ్వాన్నం. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతోందో తెలియని దుస్థితి. కనీసం అంగన్వాడీ కేంద్రం కూడలేని పరిస్థితి.దంతేలబోర గ్రామ పంచాయితీ రేషన్‌ దుకాణం విషయానికి వస్తే నెలలో నాలుగు ఐదు రోజుల మినహా ఆ రేషన్‌ దుకాణం తెరుచుకోదు. దీంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురి అవుతున్నారు. 20కేజీల బియ్యం తెచ్చుకోవడానికి 4 సార్లు తిరిగి 120రూ ఆటో కిరాయి పెట్టలేక ప్రభుత్వం ఇచ్చే రేషన్‌ బియ్యాన్ని సైతం ఒదులుకుంటున్నారు. కనీసం మా గోడు పట్టిన అధికారి గాని లేడంటున్నారు. గ్రామాల అభివృద్ధి పేరుతో వచ్చే నిధులు ఏమౌతున్నాయి. మాగ్రామాలు ఎందుకు అభివృద్ధికి దూరంగా ఉంటున్నాయి అని అధికారులని ప్రశ్నిస్తున్నారు.