అభివృద్దిని అడ్డుకోరాదు: ఎంపి
ఆదిలాబాద్,నవంబర్17(జనంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే సహించేది లేదని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, ఎంపి గోడం నగేశ్ అన్నారు. కాంగ్రెస్ నేతలు తమ ఉనికికి చాటు కోవడానికి తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుడు దోవ పట్టిస్తున్నారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తాగు, సాగునీరు ,పేదలకు డబుల్బెడ్రూంలు వంటి అనేక శాశ్వత పనులు చేపడుతుంటే , ప్రతిపక్షాలు సలహాలు ఇ/-వకుండా అడ్డుకోవడం సరికాదన్నారు. అభివృదద్ఇ పనులపై బహిరంగ చర్చకు సిద్ధం కావాలని కాంగ్రెస్ నేతలకు సవాలు విసిరారు. కాంగ్రెస్ నాయకుల స్వార్థ రాజకీయాలకు తెలంగాణ ప్రజలు సమాధానం చెబుతుతారని అన్నారు. తెలంగాణలో పేదింటి ఆడపిల్లలకు మేనమామలా సీఎం కేసీఆర్ ఆడపిల్ల పెళ్లి ఆదుకుంటున్నడని ఎంపి అన్నారు. నిరుపేద కుటుంబంలోని ఆడ పిల్లలకు వివాహం చేసేటప్పుడు తల్లిదండ్రులు ఆర్థిక భారంతో సతమతమవుతున్నారని ముఖ్యమంత్రి గ్రహించి రూ.76,116 అందించేందుకు ఈ పథకాన్ని అమలు చేయడం జరిగిందన్నారు. వచ్చే ఎన్నికల్లో మరో సారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉండటం తథ్యమన్నారు. ఎవరూ ఎన్ని జిమిక్కులు చేసినా తెలంగాణ ప్రజలు నమ్మరన్నారు.