అభివృద్ది కార్యక్రమాలే శ్రీరామరక్ష
కాంగ్రెస్,బిజెపిలతో ఒరిగేదేవిూ లేదు
జనగామ,సెప్టెంబర్30 (జనంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే శ్రీరామరక్షగా నిలుస్తాయని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లోనూ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లి ఓట్లు అడుగుతామని అన్నారు. అలాగే తమ పార్టీ వారు కూడా అభవృద్దిని ప్రజలకు వివరించిన ఓట్లు అడగాలని కార్యకర్తలకు సూచించారు. కాంగ్రెస్ బబిజెపిలతో ఒరగేదేవిూ లేదన్నారు. సీఎం కేసీఆర్ ఇతర నాయకుల సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా పనిచేశామని అన్నారు. మారుమూల గ్రామాలకు సైతం రోడ్డు నిర్మాణాలతో పాటు, అంతర్గత రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయించానని అన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, భవిష్యత్‌లో నియోజకవర్గాన్ని మోడల్‌గా తీర్చిదిద్దేందుకు అవకాశం ఇవ్వాల్సిందిగా ఆయన ఓటర్లను అభ్యర్థించారు. కాంగ్రెస్, బీజేపీ హావిూలతో ప్రజలను మభ్య పెడుతారని, వారి మాటలను నమ్మవద్దని ఎమ్మెల్యే అన్నారు. 70 ఏళ్లలో చేయలేని అభివృద్ధిని టీఆర్‌ఎస్ పార్టీ చేసి చూపించిందన్నారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన అనంతరం మ్యానిఫెస్టోలో ఉన్న అంశాలతో పాటు అందులో లేని కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లాంటి ఎన్నో పథకాలను అమలు చేస్తున్నామన్నారు. ఎందరో మంది నిరుపేద కుటుంబాల్లో ఈ పథకాలు ఆడ బిడ్డలకు ఆసర అవుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ పార్టీల నుంచి నాయకులు మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు టీఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నారన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, నిరుపేద ప్రజల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని గుర్తు చేశారు. దేశంలో ఏ
ప్రభుత్వం చేయలేని విధంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం మహిళల అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేస్తుందన్నారు. ఏ ఆసరా లేని ఆడపడుచులకు ఆసరా పింఛన్‌తో సీఎం కేసీఆర్ ఆసరా అవుతున్నారన్నారు. వికలాంగులకు , వితంతులకు, బీడీ కార్మికులకు, వృద్ధులకు పింఛన్ అందిస్తున్నారన్నారు.