అభివృద్ది కెసిఆర్‌తో మాత్రమే సాధ్యం
అది కొనసాగాలంటే ఆయన మళ్లీ సిఎం కావాలి: మాజీ స్పీకర్
భూపాలపల్లి,సెప్టెంబర్17(జనంసాక్షి): తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించడంతో పాటు, తెలంగాణను సాధించిన నేతగా సిఎం కెసిఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని మాజీ స్పీకర్ మధుసూదనాచారి అన్నారు. తెలంగాణ ప్రజలు అభివృద్దిని కోరుకుంటున్నారని, ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ది కొనసాగాలంటే మరోమారు కెసిఆ/- నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడాల్సి ఉందన్నారు.
అన్ని రాజకీయ పార్టీలు ఒక్కటైనా తెరాసను, సీఎం కేసీఆర్‌ను ఎదుర్కొనే సత్తా లేదన్నారు. కాంగ్రెస్‌తో తెదేపా జతకట్టడం విడ్డూరంగా ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో మరోమారు భూపాలపల్లి నుంచి పోటీ చేస్తున్న మధుసూధానాచారిని పలువురు కలసి అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ
రాష్ట్రంలో ప్రతిపక్షాలు కూటమిగా ఏకమైనా తెరాసకు ఓటమి ఉండదని అన్నారు. గ్రామాల్లో కార్యకర్తలు తెరాస యూత్, మహిళా సంఘాలు, సంఘటితంగా పినచేస్తూ టిఆర్‌ఎస్ గెలుపునకు దోహదపడాలన్నారు. మరోసారి భూపాలపల్లి ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రజలకు సేవకుడిగా పని చేస్తానన్నారు. ప్రగతి రథ చక్రాలు ఆగిపోవద్దని అన్నారు. తెలంగాణలో బీజేపీకి ఉన్న ఐదు సీట్లను సైతం ఈ ఎన్నికలలో కాపాడుకో లేదన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు. పేదల ఆత్మగౌరవం కాపాడాలనే లక్ష్యంతో డబుల్‌బెడ్రూం ఇండ్లు కట్టిస్తున్నారన్నారు. రానున్న రోజుల్లో గుడిసెలు లేని రాష్ట్రంగా అభివృద్ధి చేసి ప్రతిపక్షాల దిమ్మ తిరిగేలా చేస్తామన్నారు. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ పార్టీలకు ఓటు అడిగే హక్కు లేదన్నారు. రానున్న రోజల్లో ఎస్సారెస్పీ కాల్వలో ఏడాది పొడవునా గోదావరి జలాలు పరుగులు తీయనున్నాయన్నారు. తెలంగాణలోని కోటి ఎకరాలకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ, వెనువెంటనే పరిష్కరిస్తూ ప్రజా సేవకుడిగా పని చేస్తానని మధుసూదనాచారి అన్నారు. తనకు ఎలాంటి వ్యాపారాలు లేవని, ప్రజా సేవే తన వ్యాపకమన్నారు. భూపాలపల్లి నియోజకవర్గానికి రూ.200 కోట్ల నిధులు
తీసుకొచ్చి అభివృద్ధి చేసినట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ మాటే నాకు ఆజ్ఞా, వేదమని ఆయనను ఆదర్శంగా తీసుకొని అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు.