అభివృద్ది పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

ఖమ్మం,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి): ఖమ్మం నగరంలో రూ. 100 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌, మేయర్‌ డా. పాపాలాల్‌ సోమవారం పరిశీలించారు. డంసలాపురం పైవంతెన, ముస్తఫానగర్‌ రహదారి విస్తరణ పనులను వారు పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. వేసవి పూర్తయ్యేనాటికి పనులన్ని పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఆయనతో పాటు కార్పొరేటర్‌లు మురళి, నాగరాజు, మనోహర్‌ లాల్‌, నిరీష రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలే ధ్యేయంగా సీఎం కేసీఆర్‌ జనరంజక పాలన కొనసాగిస్తున్నారన్నారు. గడిచిన కాలంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమాలను చూసి ప్రజలు భారీ ఓట్ల మెజార్టీతో టీఆర్‌ఎస్‌కు మళ్లీ పట్టం కట్టారన్నారు. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రతికార్యకర్త సైనికుల్లా పనిచేసి భారీఓట్ల మెజార్టీతో టీఆర్‌ఎస్‌ పార్టీ విజయానికి కృషిచేయాలన్నారు.