అభివృద్ది పేరుతో దగా చేస్తున్నారు

అనంతపురం,సెప్టెంబర్‌13(జనంసాక్షి): ప్రజలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దగా చేస్తున్నాయని సిపిఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్‌ పేర్కొన్నారు. రాష్టాన్రికి  రావాల్సిన ¬దాను, నిధులను రాబట్టడంలో గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు విఫలం అయ్యారన్నారు. పోలవరానికి వంద శాతం నిధులు కేంద్రమే భరించేవిధంగా హావిూ తీసుకున్నా అనుమానాలు ఉన్నాయని  తెలిపారు. ¬దాతో వచ్చే నిధులకన్నా మరిన్ని ఎక్కువగా తీసుకురావడానికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నట్లు చెప్పుకుని ప్రజలను తప్పుదోవ పట్టించరాదని వివరించారు. క్షేత్రస్థాయిలో పరిశ్రమలు తెస్తామన్న వారు హావిూలకే పరిమితమయ్యారని చెప్పారు. పరిశ్రమల పనులు ఎక్కడా జరగడం లేదన్నారు. ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని, రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ది పనులు జరగడం లేదని తెలిపారు. యువత ఇతర రాష్టాల్రకు వలసబాట వెళ్లాల్సి వస్తోందని అన్నారు. రైతులకు ఉపాధిలేక ఇతర నగరాలకు వలస వెళ్తున్నారని అన్నారు. దీనికి కారణం ప్రభుత్వ నిర్లక్ష్యం అన్నారు. జిల్లాలోనే కాక రాష్ట్రంలోను కూడా ఉపాధి కరువైందన్నారు.