అభివృద్ధికి అణుశక్తి అవసరమా ?.
తొలగించడానికి రాస్తున్నామనే అంటున్నారు. ప్రజలకు స్వతహాగా అపోహలు కలగదానికిది సా యిబాబా కన్ను తెరవడమో వినాయకుడి క్షీరపాన మో కాదు. ఒకరు కలిగిస్తే తప్ప ఈవిషయంలో అపోహలు కలిగే అవకాశం లేదు. ఊహలయినా అపోహలయినా వ్యాఖ్యాతల అభిప్రాయాల వల్ల క లుగుతున్నవే. ఈ అభిప్రాయాలకు ప్రత్యక్ష ఆధా రం మూడే మూడు పత్రాలు. ఒకటి భారత అ మెరికా 123 ఒప్పందం. రెండవది అమెరికా చే సినా హైడ్ చట్టం. మూడవది భారత్‌కూ అంతర్జా తీయ అణుశక్తి సంస్థ (ఐఏఈఏ) కూ మధ్య కు దిరిన ముసాయిదా ఒప్పదం.
ఈ మూడు చిన్న పత్రాలే. మూడూ ఇప్పుడం దరికీ వచ్చేసిన ఇంగ్లీష్ భాషలోనే ఉన్నాయి. మూడూ కొంచెం పరిజ్ఞానం ఉన్న వాళ్లకు అర్థం కావడం పెద్ద కష్టం కాదు. అయినప్పటికీ ఎడతెగ ని అభిప్రాయభేదాలు ఎందుకున్నాయి? ఈ మూ డు పత్రాలలోని విషయాలు అందరికీ స్పష్టంగానే ఉన్నాయి. అయితే అత్యంత స్పష్టమైన సంగతేమి టంటే అవి కీలకమైన అంశాల్లో ఉద్ధేశ్యపూర్వకం గా అస్పష్టంగా ఉన్నాయనేది. భారత ప్రయోజనా లుగా పాలక పక్షమూ ప్రతి పక్షాలూ కూడా అంగీ కరించే వాటికి ఈ అస్పష్టత నష్టకరం అనేది ఒకరి వాదన కాగా, ఏం ఫరవాలేదనేది మరొకరి వైఖరి.
లోక్‌సత్తా నాయకుడు జయప్రకాశ్ నారయణ్ అయితే ఈ అస్పష్టత అత్యవసర పరిస్థితులలో మ న ప్రయోజనలకే లాభదాయకం కాగలదని దైర్యం గా అనేశారు. ఇంత సీరియస్ విషయంలో ఉద్ధేశ్య పూర్వకంగా అస్పష్టత ఉందంటే దాని వెనుక బల వత్తరమైన కారణం ఉంటుందని వేరే చెప్పనవస రం లేదు. 123 ఒప్పందాన్ని భారత్ ఉల్లంఘిం చిందని ఏ పరిస్థితులలో భావించబడుతుంది, ఆ పైన ఒప్పందంతో భారత్ పొందే లబ్ధికి ఏం గతి పడుతుందనే నిర్ణయాలు అమెరికా గు ప్పిట్లో ఉం చడం ఈ అస్పష్టత లక్ష్యం. దీనికి సాధనం హైడ్ చట్టం. ఈ సంగతీ అందరికీ అర్థం అయింది.
ఆ కారణంగానే వ్యతిరేకించేవారు ఆందోళన చెందుతుండగా, ఆ కారణంగానే ఒప్పందాన్ని స మర్థించే వాళ్లు ధైర్యంగా ఉన్నారు. (ఇక్కడ భారతీ య జనతా పార్టీ గురించి ప్రస్తావించడం లేదు. వాళ్లది వట్టి అవకాశవాదం. అధికారంలో ఉంటే ఈ ఒప్పందం వాళ్లే చేసుకునేవారు) రెండు వైఖరు లూ సమకాలీనా చరిత్ర పైన ఆధారపడినవే. రెం డు ఆ చరిత్రను వాస్తవికంగా అర్థం చేసుకున్నవే. తన పంచన చేరిన వారి ప్రయోజనాలకు అమెరి కా ఎట్టి పరిస్థితిలోనూ నష్టం కలగనీయదు. అంత ర్జాతీయ న్యాయసూత్రాలు, ఒప్పంఆలు ఏవీ దీనికి అడ్డురావు.
అట్లాగే తన పంచన చేరని వారిని అదుపు చేయడానికి అమెరికా ఎంత దైర్జన్యానికైనా ఎంత నీచానికైన ఒడిగడుతుంది. దానికి సహితం ఏ న్యా యసూత్రాలు, ఒప్పంద సంబంధమైన నియమా లూ అడ్డం రావు. కాంగ్రెస్ పాలనలో భారత్ అమె రికా పంచన ఇప్పటికే కొంతమేరకు చేరిపొయిం ది. ఇంకా పూర్తిగా చేరబోతుంది. దీనికి వ్యూహాత్మ క సహచర్యం అని వారూ వీరూ కూడా పేరు పె ట్టుకున్నారు. ఆవ్యూహం ఏమిటంటే ఆసియాలో అమెరికాకు కొరకరాని కొయ్యలుగా ఉన్న ఇద్దరు ప్రత్యర్థులను నిలువరించడం. ఒకరు చైనా, రెండ వవారు ఇస్లాం పేరు మీద అమెరికా ఆధిపత్యాన్ని ఎదుర్కొంటున్న పశ్చిమాసియాకు చెందిన వివిధ దేశాలు, సాయుధ సంస్థలు.
రెండెంకెల వృద్ధిరేటును వెంటాడుతున్న భార త ఆర్థిక వ్యవస్థ కల్పించే పెట్టుబడి అవకాశాలు ఈ వ్యూహంలో ఒక బోనస్ కావచ్చు లేదా దాని ఆర్థిక పార్శకంగా భావించవచ్చు. అమెరికాకు ఏం కావాలో స్పష్టంగానే ఉంది. మన పాలకుకేం కావా లి ? రాత్రికి రాత్రి అగ్రరాజ్యం అయిపోవాలి. ఒక్క పాలకపక్షమే కాదు. అణు ఒప్పందాన్ని సమర్థిస్తు న్న వారందరూ ఈ ఒప్పందం ద్వారా ఎదురుచూ స్తున్న మహధ్భాగ్యం అదే అమాయకుడో తెలివిత క్కువ వాడో కానీ రాహూల్ గాంధీ మొన్నటి పార్ల మెంటు చర్చలో నిస్సంకోచంగా అననే అన్నాడు.
అణు విద్యుత్ ఎంత ఉత్పత్తి కాబోతుంది, మ న అవసరాలు ఎంత తీర్చబోతుంది అనేది కాదు సమస్య. భారత్ అగ్రరాజ్యం అవుతుందా లేదా అ న్నది సమస్య ఆర్థిక సంస్కరణలు ఏమని మొదలు పెట్టి రెండంకెల వృద్ధిరేటు ఏకైక ఆర్థిక లక్ష్యంగా పెట్టుకున్నామోగానీ మానవ ఆభివృద్ధి సూచికలో ఆఫ్రికాలోని కడు బీద దేశాలతో పోటీ పడుతున్న ఇండియాలో అప్పటినుంచి ఈ వికారమైన కోరిక చాలామందిని పట్టుకుంది. దానికి సులభమైన మార్గం అమెరికా చంకనెక్కి కూర్చోవడం. మన్మో హన్ సింగ్, చిదంబరం లాంటి వాళ్లు మరీ రాహు ల్ గాంధీ అంత అమాయకులు కారు కాబట్టి మరీ అంత ఎబ్బెట్టుగా అనలేక, అడిగిన ప్రతి ప్రశ్నకూ డొంక తిరుగుడు జవాబులు చెప్తున్నారు.
అణువిద్యుత్‌కు సంబంధించిన కొన్ని ప్రాథమి క గణంకాలను శాస్త్రవేత్తలోవరే కాదనడంలేదు. ప్రస్తుతం భారత విద్యుదుత్పత్తిలో అది 3 శాతం కూడా లేదు. దేశ ఆర్థిక వ్యవస్థ 8 శాతం వృద్ధిరే టును పొంది. నిలబెట్టుకునేట్లయితే 2020 నాటికి అవసరమయ్యే విద్యుత్తులో అణువిద్యుత్తులో మన పాలకులు కోరికలన్నీ ఒనగూడినా కూడ 7.5 శా తం దాటదని దేశ ప్రణాళికా సంఘం 2006 లో అంచనా వేసి చెప్పింది. వృద్ధిరేటు 10శాతం ఉం డేటట్టయితే ఇది ఇంకా తక్కువ ఉంటుంది. ఈ మ హాభాగ్యానికి దేశాన్ని ఇతరత్రా ఇంత నష్టకరమైన ఒప్పందంలోకి ఎందుకు నెడుతున్నారన్న ప్రశ్నకు ప్రభుత్వం దగ్గర జవాబేమిలేదు.
అది ప్రణాళికా సంఘం 200 ఆగస్టు నెలలో వేసినా అంచనా అనీ, ఇప్పటీ అంచనాల ప్రకారం 2020 నాటికి అణువిద్యుత్ మొత్తం విద్యుత్ ఉత్ప త్తిలో 9.5 శాతానికి చేరుకుంటుందనీ ప్రభుత్వం అంటున్నది. అదేం పెద్ద సంఖ్యా కాదుగానీ దానికై నా ఆధారమేమిటన్న ప్రశ్నకుఏ జవాబూ లేదు. అ సలు హైడ్ చట్టాన్ని గురించే అన్నిటికంటే డొంక తిరుగుడు జవాబు చెప్తున్నారు. 123 ఒప్పందం ఉ భయదేశాల జాతీయ చట్టాలను అనుసరించి అమ లవుతుంది. అని ఆ ఒప్పందంమే అంటుంది. అ మెరికాకు సంబంధించినంతవరకు అటువంటి ఒ క జాతీయ చట్టం హైడ్ చట్టం
దాని ప్రకారం 123 ఒప్పందం కొనసాగాలం టే ఇండియా అణు విస్పోటనానికి పాల్పడకుండా ఉండటమేకాదు, అణ్వస్త వ్యాప్తిని నిరోధించే పేరి ట అమెరికా అంతర్జాతీయంగా అనుసరించే విధా నాలక అనుగుణ్యమైన విదేశాంగానీతి కలిగి ఉం డాలి. ప్రత్యేకించి ఇరాన్‌ను కట్టడిచేసే విషయంలో అమెరికాకు సహకరించాలి. 123 ఒప్పందం చే సుకున్న ఫలితంగా భారత్ ఐఏఈఏ పర్యవేక్షణ కింద పెట్టే పౌర అణురంగానికి ఇక మీదట కేవ లం యురేనియం దిగుమతులేకాక అన్ని రకాల సాంకేతిక ప్రక్రియలు పరికరాల దిగుమతులు లభి స్తాయని ప్రభుత్వం అంటుండగా, భారత్ గడిచిన యాబై ఏళ్లలో ప్రత్యేక నైపుణ్యం సాధించిన రీ ప్రా సెసింగ్, హైవీ వాటర్ సాంకేతిక సహకారం ఇవ్వడం జరిగదని హైడ్ చట్టం అంటుంది.
ఒప్పందంలో ఏదో ఒక అంశాన్ని భారత్ అ తిక్రమించందని చెప్పి అమెరికా ఈ ఒప్పదంద నుంచి తప్పుకున్నట్టయితే అప్పటిదాకా దిగుమతి చేసుకున్న రియాక్టర్ల జీవితకాలం అవసరమయ్యే యురేనియం నిల్వ ఉంచుకునే అవకాశం 123 ఒ ప్పందంలో ఉందని మన్మోహన్ సింగ్ అంటున్నా రు. అయితే హైడ్ చట్టంలో మాత్రం ఎప్పటికప్పు డు నిర్వహణకు అవసరమయ్యే మేరకు మాత్రమే ఇండియా యురేనియం నిల్వలు ఉంచుకోవచ్చు ఉంటుంది. ఒక వేళ అమెరికా తెంపేసుకున్నట్టయి తే అణు సంబంధ సామాగ్రిని ఎగుమతి చేయగల ఇతర దేశాలతో ఒప్పందం చేసుకుంటామని మ న్మోహన్ అంటుండగా, ఇండియాగానీ ఒప్పందా న్ని అతిక్రమిస్తే తాను సహకారాన్ని నిరాకరించడ మేకాక ఇతర దేశాలను కూడ అదే దారిలో పెట్టే బాధ్యత అమెరికా పైన హైడ్ చట్టం అంటుంది.
వీటి విషయం ఏమిటని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడిగితే, హైడ్ చట్టం అమెరికా వారి చట్టం అది వారికి శిరోధార్యం, మనకు మనకు కాదు అన్న అర్థహిత జవాబు చెప్తున్నారు. మనకు 123 ఒ ప్పందమే శిరోధార్యం అంటున్నారు. అయితే అమె రికా ఆ ఒప్పందాన్ని హైడ్ చట్టం వెలుగులో అర్థం చేసుకుంటుంది. కదా అంటే 123 ఒప్పందాన్ని అమెరికా కాంగ్రెస్ ఆమోదించిన పిదప అది కూ డా ఒక చట్టమే అవుతుందనీ, వెనకొచ్చిన చట్టం కాబట్టి ముందొచ్చిన హైడ్ చట్టం పై దీనిదే బలమ నీ న్యాయకోవిదుడయిన చిదంబరం అంటున్నారు.
ఈ న్యాయసూత్రం బాగానే ఉంది గానీ వెన కొచ్చిన చట్టమే ఈ ఒప్పందం ముందొచ్చిన చట్టా లకు లోబడి అమలవుతుందనీ చెప్పినప్పుడు దేనిది పైచేయి అవుతుంది? ఇవన్నీ వాదనకోసమే గానీ, 123 ఒప్పందాన్ని చించి చెత్తబుట్టలో పారేయాల ని అమెరికా నిర్ణయించుకున్ననాడు వారికి ఒక చ ట్టం అవసరమా ? ఒక న్యాయసూత్రం అవసర మా ? ఏ న్యాయసూత్రం చూసుకుని అమెరికా ఇ రాక్‌ను ధ్వంసంచేసింది? ఇరాన్‌ను బెదిరిస్తున్నది? ఉత్తర కొరియాను లోబరుచుకుంది? ఇక్కడే మొద ట్లో చెప్పిన విషయానికి తిరిగి వస్తాం. మనం ఎప్ప టికీ ఈ స్థితిలో ఉండమని ఈ ఒప్పందాన్ని సమర్థి స్తున్న వారి ధీమా. ఎందుకుండము? మనం ఇంక ఎప్పటికీ అమెరికాతో గొడవ పెట్టుకోము కాబట్టి నమ్మిన బంటుగానే ఉంటాము కాబట్టి
ఇది ఎంత మంది భారతీయులకు ఆమోదనీ యం ? కాగా అసలు అణుశక్తి అభివృద్ధికి అవస రం అన్న అభిప్రాయాన్నే ప్రశ్నించవలసిఉంది. వే గంగా అభివృద్ధిరేటు పెంచుకుంటూ పోవలసిందే ననీ, దానికి అపారంగా కరెంటు కావలసిందేననీ, అందుకోసం అణుశక్తి అవసరమేననీ దబాయించే తర్కాన్ని ఎందుకు ఆమోదించాలి? ప్రపంచాన్నం తా వలసలుగార పంచుకుని పిడికెడు పెట్టుబడిదా రీ దేశాలు సాధించిన కృత్రిమ జీవనాన్ని అందరం ఎందుకు అనుకరించాలి? అనుకరిస్తే భూమి, ప్ర కృతి తట్టుకోగలవా? రెండెంకెల విధ్వంసక వృద్ధి రేటు లక్ష్యం ఎందుకు కావాలి ? ఆ విధ్వంసాని కో చిహ్నమైన అణుశక్తిని ఎందుకు ఆహ్వా నించాలి ?
ఇప్పుడు కాదని ఒప్పుకొంటూ కూడ ప్రత్యక్ష కాలుష్యం లేని కారణంగా శుభ్రమైన ఇంధనం అ ని దానిని కీర్తిస్తున్నారు. పొగ, మురికి నీళ్లు అణు శక్తి కేంద్రాల నుంచి బయటకు రాకపోవచ్చును గానీ ప్రాణంతకమైన అణు ధార్మిక కాలుష్యం ని రంతరాయంగా ప్రసారం అవుతూనే ఉంటుంది. ఆ విషయం గ్రహించి ఒక్క ఫ్రాన్స్‌ను మినహా యించి తక్కిన అభివృద్ధి చెందిన దేశాలు పౌర రంగంలో అణు సాంకేతిక ప్రక్రియలనూ పరికరా లనూ అమ్ముకోవడానికొక మార్కెట్ అవసరం జన రల్ ఎలక్ట్రికల్ వంటి సంస్థకొచ్చింది. దాని పర్యా వసానమే అణుశక్తి పునరుజ్జీవం గురించి అమెరి కా వంటి దేశాలు చేస్తున్న ప్రచారం.
ఈ పునరుజ్జీవనం ఎక్కడ జరుగుతన్నదో తె లుసుకోవాలంటే ఐఏఈఏ డైరెక్టర్ జనరల్ మాట లలోనే వినండి. ఇండోనేషియా, థాయిలాండ్, వి యత్నాం, చైనా, ఇండియా, జపాన్, కొరియా, పా కిస్థాన్, అల్జీరీయా, బెలారస్, ఈజిప్ట్, ఇరాన్, జో ర్డాన్, లిబియా, నైజీరియా, టర్కీ యెమెన్! జపాన్ నూ కొంతమేరకు చైనాను ఇండియానూ మినహా యిస్తే అభివృద్ధి చెందిన దేశాలు ఏ సాంకతిర ప్రక్రియలను తమ మీద రుద్దితే వాటిని కొనుక్కొని వాడుకునే స్థితికి నెట్టబడ్డ దేశాలు ఇవన్నీ అణుశక్తి పునరుజ్జీవనం ఈ దేశంలో వెల్లివిరియడం అంటే ఏమిటో వివరించి చెప్పనవసరం లేదు.
– కె.బాలగోపాల్