అభివృద్ధిని మరిచిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు… *సీఎంఆర్ బియ్యాన్ని ఎఫ్సిఐ ద్వారా కొనుగోలు చేయాలి *నకిలీ విత్తనాలు అరికట్టాలి

విలేకరుల సమావేశంలో జూలకంటి
మిర్యాలగూడ. జనం సాక్షి
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధిని మరిచాయని మాజీ ఎమ్మెల్యే సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి ఆరోపించారు. శుక్రవారం స్థానిక సిపిఎం కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.. ప్రజల సంక్షేమానికి పాటుపడాల్సిన ప్రభుత్వాలు వాటిని విస్మరించి స్వార్థ రాజకీయాల కోసం పాకు లాడుతున్నారని విమర్శించారు. కార్మికులు, రైతులు, హమాలీలు, పారిశ్రామిక రంగాలు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. కేంద్ర ప్రభుత్వం సిఎంఆర్ బియ్యాన్ని  తీసుకోకపోవడం వల్ల సుమారు రెండు లక్షల మంది హమాలీలు కార్మికులు రోడ్డున పడ్డారని వాపోయారు. 1500 పైగా రైస్ మిల్లులు మూతపడ్డాయని పేర్కొన్నారు. సీఎంఆర్  బియ్యాన్ని ఎఫ్సీఐ ద్వారా కొనుగోలు చేసి మూతపడ్డ రైస్ మిల్లులను తెరిపించాలని కోరారు. కార్మికులకు హమాలీలకు ఉపాధి కల్పించి ఆదుకోవాలని కోరారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు వానకాలం సీజన్ ముంచుకొస్తుందని నకిలీ విత్తనాలు నకిలీ ఎరువులను అరికట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక చేయకపోవడం వల్ల ప్రతి ఏడాది రైతులు నష్టపోతున్నారని వాపోయారు. భూసారం బట్టి రైతులు పంటలు పండించే విధంగా అవగాహన కల్పించాలని సూచించారు. అన్నం పెట్టే రైతులకు బేడీలు వేసి తీసుకెళ్లడం అన్యాయమన్నారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతుందని, భూ నిర్వాసితుల రైతులపై పెట్టిన కేసును వెంటనే ఉపసంహరించుకోవాలని, వారిని వెంటనే జైలు నుండి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, జిల్లా నాయకులు డా. మల్లు గౌతమ్ రెడ్డి, భవాండ్ల పాండు, తిరుపతి రామ్మూర్తి, రాగిరెడ్డి మంగా రెడ్డి, పరుశురాములు, లక్మి నారాయణ, ఎండి అంజాద్,వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.