అభివృద్ధి జిల్లాలకు విస్తరించాలి
– ఇసుకకు బదులు రాక్‌సాండ్ వాడండి
– ఐటీ,మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్
హైదరాబాద్,జూన్ 18(జనంసాక్షి): పరిశ్రమల ఏర్పాటు హైదరాబాద్‌కే పరిమితం కారాదని గ్రామాలకు విస్తరిస్తామని తెలంగాణ ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. శనివారం పరిశ్రమలశాఖ వార్షిక నివేదికను ఆయన విడుదల చేశారు. పారిశ్రామిక సంస్థలకు ఈ సందర్భంగా అనుమతి పత్రాలు అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ… పరిశ్రమల ఏర్పాటు హైదరాబాద్‌కే పరిమితం చేయడం లేదని తెలిపారు. ఉపాధి కల్పనే లక్ష్యంగా జిల్లాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. నిర్మాణ రంగంలో ఇసుక కొరతను అధిగమిస్తామని వెల్లడించారు. ఇసుకకు బదులుగా రాక్‌శాండ్ వాడాలని సూచించారు. వచ్చే ఏడాది ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ నిర్వహిస్తాం. ఎలక్టాన్రిక్స్, మాన్యుఫ్యాక్టరింగ్ రంగంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. పరిశ్రమలను గ్రావిూణ ప్రాంతాలకు విస్తరిస్తాం. మైనింగ్ రంగంలో గత ఏడాదితో పోల్చుకుంటే 41శాతం ఆదాయం పెరిగింది. ఈ ఏడాది మైనింగ్ రంగంలో ఆదాయాన్ని రూ.4వేల కోట్లకు పెంచాలని ఆలోచిస్తున్నాం. మైనింగ్ కార్మికుల భద్రతకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ఇసుక రేటు భారీగా తగ్గింది. భవిష్యత్‌లో మరిన్ని పారదర్శకమైన విధానాలు అవలంభిస్తామని అన్నారు. తెలంగాణ పారిశ్రామిక విధానం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోందన్నారు. మెడికల్, ఫుడ్‌ప్రాసెసింగ్, విత్తన సీడ్ పార్క్‌లను ఏర్పాటు చేస్తామన్నారు. ఇండస్టియ్రల్ ప్రయోషన్ కోసం విదేశాల్లో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణ యువతకే ఉపాధి దక్కేలా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ప్రధాని మోడీ కూడా టీఎస్‌ఐపాస్‌ను ప్రశంసించిన విషయం గుర్తు చేశారు.తైవాన్, జపాన్, దక్షిణకొరియాల సహకారంతో ఎలక్ట్రానిక్స్ రంగంలో కలసి పనిచేస్తామన్నారు. పరిశ్రమల శాఖ పాలసీ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన విధానమన్నారు. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక విధానాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రశంసిస్తున్నారని, కొన్ని రాష్ట్రాలు తమ పారిశ్రామిక విధానం వివరాలు అడిగి తెలుసుకుంటున్నారని పేర్కొన్నారు. టీఎస్‌ఐపాస్ ఆకర్షణీయమైన విధానమని పునరుద్ఘాటించారు. పరిశ్రమల స్థాపనకు అనుమతుల సులభతరం చేశామని, ఉపాధి కల్పనే ధ్యేయంగా జిల్లాల్లో పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. గనులశాఖ రెండో వార్షిక నివేదికను విడుదల చేసిన ఆయన.. మైనింగ్ రంగంలో కార్మికుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకున్నామని తెలిపారు. కార్మికుల సంక్షేమానికి పథకాలు తెస్తున్నట్లు వివరించారు. 2015-16లో మైనింగ్‌శాఖలో 2,772 కోట్లు ఆర్జించినట్లు తెలిపిన కేటీఆర్.. 2016-17 4వేల కోట్లు లక్ష్యం పెట్టుకున్నట్లు స్పష్టం చేశారు.
పారదర్శకంగా పారిశ్రామిక అనుమతులుఅంతకుముందు హైదరాబాద్-ఆదిభట్లలో టాటా-బోయింగ్ యూనిట్‌కు శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఎంతో పారదర్శకంగా పారిశ్రామిక అనుమతులు ఇస్తోందని అన్నారు. ”టీఎస్‌ఐఐసీ ద్వారా రక్షణ రంగంలో ఏరో స్పేస్ పార్కును ఏర్పాటు చేస్తున్నాం. ఆ రంగం నుంచి వచ్చిన సలహాలకు అనుగుణంగా రానున్న రోజుల్లో రక్షణ రంగంలో ఏరో స్పేస్ విధానాన్ని ప్రభుత్వ ప్రకటిస్తుంది. అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యంతో హైదరాబాద్‌లో శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాం. ప్రధాని, ముఖ్యమంత్రి నాయకత్వంలో రాష్ట్రాన్ని వైమానిక, రక్షణ రంగ ఉత్పత్తుల తయారీకి అంతర్జాతీయ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాం. వైమానిక రంగం వటి పెద్ద పరిశ్రమలే కాదు.. చిన్న, మధ్య తరహా పరిశ్రమలూ హైదరాబాద్ తరలివచ్చేలా చేయాలన్నదే మా సంకల్పం. రాష్ట్రంలో టాటా-బోయింగ్ ఏరోస్పేస్ యూనిట్ ఏర్పాటు సంతోషకరం. ప్రభుత్వంతో టాటా-బోయింగ్ సంస్థ భాగస్వామ్యాన్ని ఆహ్వానిస్తున్నాం. రాష్ట్రంలో అన్ని పరిశ్రమలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాం. పారదర్శకంగా పారిశ్రామిక అనుమతులు ఇస్తున్నాం’ అని కేటీఆర్ స్పష్టం చేశారు.