అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన డీసీసీబీ అధ్యక్షుడు రవీందర్‌రావు
ఎల్లారెడ్డిపేట, జనంసాక్షి: డీసీసీబీ అధ్యక్షులు కొండూరి రవీందర్‌రావు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. వెంకటాపూర్, హరిదాస్‌నగర్, మధిర, ఎల్లారెడ్డిపేట , గొల్లపల్లి, బొప్పాపూర్, కోరుట్లపేట, బండలింగపల్లి, గ్రామంలో ఐకేపీ వరి ధాన్యం కేంద్రాలను ఆయన ప్రారంభించారు. గొల్లపల్లిలో రూ. 6 లక్షల వ్యయంతో నిర్మించ తలపెట్టిన రెండు సిమెంట్ రహదారుల నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ అధ్యక్షుడు అంజనీరావు, ఉపాధ్యక్షుడు కొండా రమేష్‌గౌడ్, అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.