అభివృద్ధి సంక్షేమం సీఎం కేసీఆర్ లక్ష్యం

ప్రతి మహిళ సావిత్రిబాయి పూలే ను ఆదర్శంగా తీసుకోవాలి…
పెద్దపెల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్….
ముత్తారం జనంసాక్షి/కొట్లాడి తెచ్చుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, అన్ని వర్గాల సంక్షేమం ముఖ్యమంత్రి కెసిఆర్ లక్ష్యమని మంథని మాజీ నియోజకవర్గ శాసనసభ్యులు పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ అన్నారు. బంగారు తెలంగాణ సాధన కోసం సీఎం కేసీఆర్ అహర్నిశలు శ్రమిస్తున్నారని అన్నారు. తెరాస పార్టీ మహిళ మండల అధ్యక్షురాలు పప్పు స్వరూప ఆధ్వర్యంలో మంగళవారం రోజున ముత్తారం మండల కేంద్రంలోని లక్ష్మీ గార్డెన్స్ లో నిర్వహించిన మహిళ చైతన్య సదస్సు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ పాల్గొన్నారు . ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ సారధ్యంలో తెలంగాణ ప్రభుత్వం వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించి అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథాన పయనిస్తూ దేశానికి రోల్ మోడల్ గా నిలుస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అడుగడుగునా అడ్డుకుంటుందని ఆరోపించారు. రాష్ట్రానికి న్యాయబద్ధంగా రావాల్సిన అభివృద్ధి నిధుల వాటాను ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తుందని అన్నారు. రాష్ట్రానికి నిధుల కేటాయింపు విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంతో పోరాటం చేయాల్సి వస్తుందని తెలిపారు. కేంద్రం సహకరించకపోయినా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారని అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి ప్రతిష్టాత్మక పథకాలతో సాగునీరు, తాగునీటితో పాటు విద్య, వైద్యం, వ్యవసాయం వంటి రంగాలను బలోపేతం చేశారని తెలిపారు. రైతుబంధు, రైతు బీమా, ఆసరా పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్, దళిత బందు వంటి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ అన్ని వర్గాల ప్రజలను టిఆర్ఎస్ ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే విజయం సాధిస్తారని, అభివృద్ధి, సంక్షేమ ఫలాలు టిఆర్ఎస్ విజయంలో విజయ రహస్యమని తెలిపారు. ప్రజా సహకారంతో అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ముందుకు సాగుతున్నాయని అన్నారు.మంథని నియోజకవర్గంలో మరింత అభివృద్ధి చెందింది ఎందుకు మహిళలు సావిత్రి బాయి పూలే జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని అన్ని వర్గాల మహిళలు సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా ఎదగాలని అన్నారు నియోజకవర్గంలోని జనాభాలో మహిళల సంఖ్య ఎక్కువగా ఉందని సామాజిక బాధ్యతలు భాగంగా సగభాగం ఉన్న మహిళలు ఉద్యోగం ఉపాధి రంగాల్లో ఎప్పటికప్పుడు దూసుకెళ్తున్నారని రాజకీయ రంగంలో మాత్రం అనుకున్న స్థాయిలో రాణించడం లేదని మహిళలు రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించినప్పుడే సమ సమాజం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగంలో మహిళలకు 50% రిజర్వేషన్లు కేటాయించినప్పటికీ ఆశించిన స్థాయిలో మహిళ భాగస్వామ్యం తొడవుతాలేదని రిజర్వేషన్ అనుకూలించక భర్త స్థానంలో భార్య ముక్కు భార్యలను ఎంపిక చేసి వారిని ప్రజాప్రతిని ప్రజలు ముందుకు ఉంచి ప్రజాస్వామ్యంలో వారి పాత నామమాత్రం అవుతుందని అన్నారు మంథని నియోజకవర్గంలో మహిళలు తిరిగైన పాత్ర పూజించేలా తీర్చి దిద్దడానికి మహిళ చైతన్య సదస్సు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు మహిళలు సావిత్రిబాయి పూలే అన్ని వర్గాల ప్రజలఅభ్యున్నతికి కృషి చేశారని కొనియాడారు. సావిత్రిబాయి ని ఆదర్శంగా తీసుకొని ప్రతి మహిళ పోరాట యోధురాలుగా ముందుకు సాగాలని కోరారు రాబోయే రోజుల్లో మంథని నియోజకవర్గంలో తెరాస పార్టీ జెండాలు ఎగరవేయాలని పిలుపునిచ్చారు . తనకు మరింత సేవ చేసేందుకు అందరి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జక్కుల ముత్తయ్య, జడ్పిటిసి చెల్కల స్వర్ణలత అశోక్ కుమార్ యాదవ్,వైస్ వైసీపీ రవీందర్రావు, తెరాస పార్టీ మండల అధ్యక్షుడు కిషన్ రెడ్డి, రైతుబంధు మండల కన్వీనర్ అత్తే చంద్రమౌళి, సర్పంచ్ల ఫోరం మండల కన్వీనర్ నూనె కుమార్, తెరాస పార్టీ యూత్ అధ్యక్షుడు రాగుల సతీష్, తెరాస పార్టీ అధికార ప్రతినిధులు తిత్తుల శ్రీనివాస్, బేధ సంపత్, తెరాస పార్టీ ప్రధాన కార్యదర్శి పెయ్యాల కుమార్, తెరాస పార్టీ మంత్రి నియోజకవర్గం మహిళ అధ్యక్షురాలు గీతాబాయి, సర్పంచులు, వేల్పురి సంపత్ రావు, నేతేట్ల మహేందర్, మేడగొని సతీష్, అత్తే లలిత, గాధం స్రవంతి,ఎర్రం శారద,పర్శ లక్ష్మి, ఉప్పు సుగుణ, సముద్రాల రమేష్, తుంగాని సమ్మయ్య, ఎంపీటీసీలు బియ్యని శ్యామల, రామగల్ల పోశమ్మ, అల్లం తిరుపతి, గ్రామ శాఖ అధ్యక్షులు, గ్రామ శాఖ మహిళా అధ్యక్షులు, గ్రామ శాఖ యూత్ అధ్యక్షులు, రైతు బంధు గ్రామ శాఖ అధ్యక్షులు, సింగిల్ విండో డైరెక్టర్లు, ఏఎంసీ డైరెక్టర్లు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు తెరాస నాయకులు కార్యకర్తలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు