అభివృధ్ది, సంక్షేమానికి పెద్దపీట వేసే బీఆర్‌ఎస్‌ పార్టీకి పట్టం కట్టాలి – బిఆర్ఎస్ మండల పార్టీ సీనియర్ నాయకుడు ఇనగంటి రామారావు

అభివృధ్ది, సంక్షేమానికి పెద్దపీట వేసే బీఆర్‌ఎస్‌ పార్టీకి పట్టం కట్టాలి – బిఆర్ఎస్ మండల పార్టీ సీనియర్ నాయకుడు ఇనగంటి రామారావు

జనం సాక్షి , కమాన్ పూర్ : అభివృద్ధి సంక్షేమానికి పెద్ద పీట వేసే బిఆర్ఎస్ పార్టీకి రాబోయే ఎన్నికల్లో పట్టం కట్టాలని టిఆర్ఎస్ పార్టీ మండల సీనియర్ నాయకులు ఇనగంటి రామారావు కోరారు. ఆదివారం పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలంలోని నాగారం గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ సమావేశాన్ని నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ అధికారంలోకి వచ్చాక మానీఫెస్టోలో పెట్టని అనేక పథకాలకు రూపకల్పన చేసి అమలు చేశారని, ప్రజల అవసరాలను గుర్తించి పథకాలు రూపొందించారే తప్ప ఓట్ల కోసం ఏనాడు ఆలోచన చేయలేదన్నారు. తొమ్మిదేండ్ల కాలంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలుచేసే పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు. నాలుగేండ్లు ఎమ్మెల్యేగా పుట్ట మధూకర్‌కు అవకాశం కల్పిస్తే ఎంతో అభివృధ్ది చేయడంతో పాటు ఈ ప్రాంత పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేశారని అన్నారు. ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేసి పుట్ట మధును మంథని ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. గ్రామములో గడప గడప కి వెళ్లి తెలంగాణ ప్రభుత్వము చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి గురించి ప్రజలకు వివరించి పుట్ట మధుకు కి ఓటు అడగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కమాన్ పూర్ మండల బీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు, గ్రామ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.