అమరజ్యోతి ర్యాలీని ప్రరంభించిన బాలకృష్ణ, లోకేశ్
హైదరాబాద్: ఎన్టీఆర్ 17వ వర్థంతి సందర్బంగా సినీ నటుడు బాలకృష్ట, తెదేపా అధినేత చంద్రబాబునాయుడు తనయుడు లోకేశ్ రసూల్‌పురాలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఎన్టీఆర్ అమర జ్యోతి ర్యాలీని బాలకృష్ట, లోకేశ్ ప్రారంభించారు. ఎన్టీఆర్ అఖిల భారత అభిమానుల సంఘం అధ్యక్షుడు శ్రీపతి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించే ఈ ర్యాలీ ఎన్టీఆర్ ఘాట్ వరకు కొనసాగుతుంది.