అమరావతికి నిధులు వస్తున్నాయి. 

అమరావతి(జనం సాక్షి):

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి నిధుల కొరత తీరనుంది. దీని కోసం ప్రపంచ బ్యాంకు ఏడీబీ (ఏసీయన్ డెవలప్‌మెంట్ బ్యాంక్) 1.6 బిలియన్ డాలర్లు అప్పుగా ఇవ్వనున్నట్లు సీఐడీఏ ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. ఏడీబీ బోర్డు సమావేశం డిసెంబర్ 8న.. ఆ తర్వాత ప్రపంచ బ్యాంక్ బోర్డు సమావేశం జరుగుతుందని వాటిలో ఈ అప్పు ప్రతిపాదనను ఆమోదిస్తారని అధికారులు చెప్పారు. దీనికి సంబంధించి ఇప్పటికే చర్చలు పూర్తి అయ్యాయన్నారు. రుణం మొత్తం రూ. 13,600 కోట్లు ఐదేళ్ల పాటు పలు విడతల్లో ఇస్తారని.. డిసెబర్‌లో 10 శాతం అడ్వాన్స్‌గా ఇస్తారని వివరించారు. వచ్చే జనవరి నెలాఖరున మొదటి విడత అప్పుడు రావచ్చునని అంచనా వేస్తున్నట్లు ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు అధికారులు తెలిపారు.