అమరావతిపై  బిజెపి ద్వంద్వ ప్రమాణాలు

 

రాజధానిని నిర్ణయించడంలో విూనమేషాలు

ప్రజలను ఆయోమయంలోకి నెట్టేలా నిర్ణయాలు

అమరావతి,నవబంర్‌18(జనం సాక్షి ): ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి విషయంలో బిజెపి అనుసరిస్తున్న విధానంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. రాజధాని అంటూ ఒకటి ఉండకుండా జగన్‌ ప్రభుత్వం నాన్చుతున్నా కేంద్రంలోని బిజెపి అంటీముట్టనట్లుగా వ్యహరించడంపై మండిపడుతున్నారు. అమరావతి ఉద్యమానికి మద్దతు తెలిపిన బిజెపి తమకు అధికారం అప్పగిస్తే మూడేళ్లలో రాజధాని నిర్మాణం చేస్తామని ప్రకటించింది. అయితే దీనిపై కేంద్రం నుంచి ఎలాంటి చేయూలత లేదా ప్రకటన చేయించడం లేదు. కనీసం అమరావతి కొనసాగాలని, ఏదో ఒక రాజధాని ఉండాలని చెప్పడం లేదు. కేంద్రం  ఒక తీరుగా, రాష్ట్రం మరోతీరుగా బిజెపి ద్వంద్వ విధానాలు అనుసరిస్తోంది. ప్రత్యేక హోదా, విభజన హావిూల విషయంలో కప్పదాటు వ్యవహారం చేస్తున్న బిజెపి నాయకులు రాజధాని విషయంలోనూ అదే పద్ధతిని అనుసరిస్తు న్నారు. ఒకవైపు రాష్ట్ర రాజధాని అంశంపై పెద్దఎత్తున ఆందోళనలు జరుగుతుంటే అవేవిూ తెలియనట్లు హైదరాబాద్‌ను ఎపి రాజధానిగా కేంద్రం తన అధికార పత్రాల్లో పేర్కొంటోంది. మరోవైపు రాజధానిగా అమరావతికే తమ మద్దతు అంటూ రాష్ట్రస్థాయి బిజెపి నేతలు చెబుతున్నారు. మాటల్లో అమరావతికి మద్దతు తెలియజేస్తూ ఆచరణలో రాజధానిగా హైదరాబాద్‌ను పేర్కొనడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమ వుతోంది. హైదరాబాద్‌ నుండి అమరావతికి ప్రభుత్వ కార్యాలయాలు, సెక్రటేరియట్‌ మారి ఆరేళ్లు కావస్తున్నా ఇప్పటికీ హైదరాబాద్‌ అడ్రస్‌తోనే కేంద్రం ఉత్తర, ప్రత్యుత్తరాలు జరుపుతున్నవిషయం ప్రజలకు ఆశ్చర్యం కలిగించే విషయం. అమరావతి విషయంలో ఉద్దేశపూర్వకంగానే రెచ్చగొట్టే ధోరణితో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శలు వస్తున్నాయి.  అభిప్రాయపడుతున్నారు. కేంద్రం నుండి రావాల్సిన నిధుల అంశాన్ని ప్రశ్నించే అవకాశం లేకుండా చేయడానికే ఈ పన్నాగం పన్నిట్లు తెలుస్తోంది.  వాస్తవంగా సిఎం క్యాంపు కార్యాలయం, అసెంబ్లీ, రాజ్‌భవన్‌ అన్నీ అమరావతి పరిధిలోనే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ప్రకారం ప్రత్యుత్తరాలన్నీ అదే అడ్రస్‌కు పంపించాల్సి ఉంటుంది. పరిపాలనంతా అమరావతిలో ఉంటే హైదరాబాద్‌ అడ్రస్‌తో వివరాలన్నీ పంపించడం చర్చనీయాంశం అయింది. రాజధానికి సంబంధించిన అంశాలపై ఇప్పటికే కోర్టుల్లో విచారణ జరుగుతోంది. అమరావతికి భూములిచ్చిన రైతులు 700 రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. ప్రస్తుతం తిరుపతికి పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రకు బిజెపి కూడా మద్దతు ప్రకటించింది.  గతేడాది మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టి కేంద్రానికి పంపింది. రాజధాని అన్నది రాష్ట్రంపరిధిలోనిదని అంటూ తప్పించుకుంది. మూడు రాజధానులను గుర్తించాలంటే రాష్ట్రపతి కూడా బిల్లుకు ఆమోదముద్ర వేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌నే రాజధానిగా పేర్కొనడం వెనుక మూడు రాజధానులను కూడా కేంద్రం ఆమోదించలేదన్న విషయం అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో అసలు ఆంధప్రదేశ్‌ రాజధాని ఏదనేది సందిగ్ధంలో పడిరది. ఇలా  దోబూచులాడుతున్న బిజెపి ప్రజలకు సమాధానం ఇచ్చుకోవాలి.