అమరావతిలో ప్రత్యేక ఏర్పాట్లు
గుంటూరు,ఫిబ్రవరి16(జనంసాక్షి ): పంచారామ ప్రథచమ క్షేత్రమైన అమరావతి అమరేశ్వరాలయంలో మహాశివరాత్రి శోభ సంతరించుకుంది. ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కొత్త రాజధాని ఏర్పాటు కానున్న ప్రాంతానికి సవిూపంలోనే ఇది ఉండడంతో ఇప్పుడు దీనికి అధిక సంఖ్యలో భక్తులు వస్తారని ఆశిస్తున్నారు. ఈఏడాది ఎక్కువ సంఖ్యలో భక్తులొస్తారని భావిస్తుండగా, వారికి అసౌకర్యం కలక్కుండా తగిన ఏర్పాట్లు చేసారు. అమరేశ్వరుడి దర్శనానికి వచ్చే భక్తులు ఎలాంటి బ్బందులు పడకుండా పక్కాగా ఏర్పాట్లు చేశారు. అమరేశ్వరాలయాన్ని మహాశివరాత్రి రోజున దర్శించుకునే భక్తులందరూ ముందుగా కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి ఆతర్వాతే ఆలయంలోకి అడుగుపెడతారు. అయితే ఈఏడాది కృష్ణానదిలో నీరు సక్రమంగా లేకపోవడంతో పుణ్యస్నానాలకు నది మధ్యభాగంలోని రెండో పాయవరకు వెళ్లాల్సిన అవసరం ఏర్పడింది. ప్రస్తుతం ఉన్న నీటి ప్రవాహంవద్ద భూమి ఎగుడుదిగుడుగా ఉండటంతో భక్తులు లోతుల్లోకి జారే ప్రమాదం ఉండడంతో ప్రత్యేక ఏర్పాటు చేశారు. అలాగే ఆలయానికి వచ్చే భక్తులు కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఇబ్బందులు పడకుండా వారికి మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. స్నానఘట్టంలో గజ ఈతగాళ్ళను, పడవలను ఏర్పాటు చేశారు. మహాశివరాత్రి బ్ర¬్మత్సవ వేడుకలను పురస్కరించుకుని అమరావతి అమరేశ్వరాలయానికి ప్రత్యేక అలంకరణలు చేయడంతో ఆలయం కొత్తశోభతో కళకళలాడింది. ప్రధాన గాలిగోపురానికి పరమేశ్వరుడు, పార్వతీ మాతల రూపంతో విద్యుత్తు వెలుగులు ఏర్పాటు చేయడంతో దేదీప్యమానంగా ప్రకాశించింది. ఆలయంలోపలి భాగంలోనూ నీలి వర్ణపు షామియానాలను అలంకరించడంతో కోవెలలో అడుగడుగునా పండుగ శోభ దర్శనమిచ్చింది. మహా శివరాత్రి పర్వదినానికి భక్తజనులతో కోటప్పకొండ కిటకిటలాడింది. ఉదయం నుంచే భక్తుల రద్దీ పెరిగింది. క్యూలైన్లన్నీ భక్తులతో కిటకిటలాడాయి. నూతనంగా అభివృద్ధి చేయడంతో దేవస్థానం పక్కన విశాల స్థలం ఏర్పడటంతో దర్శనానంతరం భక్తులు తోపులాటలేకుండా ప్రశాంతంగా కిందకు వచ్చారు.