అమరావతి ఆదాయంతోనే ప్రగతి ఖర్చు: నారాయణ
నెల్లూరు,ఆగస్ట్31(జనం సాక్షి): రాజధాని అమరావతి నిర్మాణానికి ఖర్చుచేసే ప్రతిపైసా.. అక్కడి ఆదాయంతోనే తిరిగి చెల్లిస్తామని రాష్ట్ర మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… 2019 నాటికి రాజధానిలో మేజర్ వర్కులన్నీ పూర్తి చేస్తామన్నారు. అనవసర ఆరోపణలు చేసేవారు రాజధానిలో జరిగే పనులు చూసిన తరువాత మాట్లాడాలన్నారు. అలాగే రూ.28వేల కోట్ల పనులు గ్రౌండ్ అయ్యాయని, మరో రూ.20వేల కోట్ల పనులకు త్వరలో టెండర్లు జరుగుతాయన్నారు.