అమరావతి ఉద్యామన్ని ఆపలేరు

రైతులకు బేడీలు వేయడం దారుణం

గుంటూరు,నవంబర్‌2(జ‌నంసాక్షి): అమరావతి ఉద్యమంలో పాల్గొన్న రైతులను బేడీలు వేసి అరెస్ట్‌ చేయడం ద్వారాప్రభుత్వం తన గొయ్యిని తానే తవ్వుకుందని టిడిపి లెఫ్ట్పార్టీలు దుయ్యబట్టాయి. రైతులకు మద్దతుగా చే/-తున్న ఆందోళనలను అణివేయడం కాదని, ప్రజల ముందుకు వచ్చి నిజాయితీ ఒప్పుకోవాలన్నారు. దళిత రైతుల చేతికి బేడీలు రాష్ట్ర ప్రభుత్వానికి శాపంగా వెంటాడుయని సీపీఐ రాష్ట్ర సహాయకార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు హెచ్చరించారు. హౌస్‌ అరెస్టులు ఉద్యమాన్ని ఆపలేవని స్పష్టం చేశారు. అకారణంగా దళిత రైతులను 8 రోజులుగా జైల్లో పెట్టడం ఏ చట్టం ప్రకారం చేశారని ప్రశ్నించారు. ఈ దుర్మార్గానికి ప్రభుత్వం మూల్యం చెల్లించక తప్పదన్నారు. చలో జైలు ఇప్పటికే జయప్రదం అయినట్లే అని… స్పష్టం చేశారు. రాష్ట్రంలో రౌడీరాజ్యం నడుస్తోందని మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ధ్వజమెత్తారు. రైతులను భేషరతుగా విడుదల చేసి అక్రమ కేసులు ఎత్తివేయాలన్నారు.

అమరావతి రాజధాని, పోలవరం రెండింటినీ ప్రభుత్వం సర్వనాశనం చేస్తోందన్నారు. పేద ప్రజలకు పూర్తయిన ఇళ్లను కూడా అందించి వారి సొంతింటి కలను సాకారం చేయలేదన్నారు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని హెచ్చరించారు. ఇదిలావుంటే రాష్ట్ర ప్రభుత్వం రాజధాని రైతులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు.దౌర్జన్యంగా, కుట్రపూరితంగా రాజధానిని మార్చాలని అనుకుంటున్నారే తప్ప ప్రజాభిప్రాయాన్ని తీసుకోవటం లేదన్నారు. రైతులపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టిన విషయంలో ప్రభుత్వం క్షమాపణ చెప్పాలన్నారు.