అమరావతి నిర్మాణం పేరుతో అక్రమాలు
రాజధాని నిర్మాణం చేపట్టేదెవరు? సింగపూర్ ప్రభుత్వమా? ఆదేశ ప్రైవేట్ కంపెనీనా?
సింగపూర్ కంపెనీలకు కారుచౌకగా భూములను కట్టబడుతున్నారు
వైసీపీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు
శ్రీకాకుళం, జూన్9(జనం సాక్షి ) : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం పేరుతో ప్రభుత్వం అక్రమాలకు పాలుపడుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు. శనివారం ఆయన విూడియాతో మాట్లాడుతూ.. రాజధాని నిర్మాణం సింగపూర్ ప్రభుత్వం చేపడుతుందా? లేక ఆ దేశ ప్రైవేట్ కంపెనీ చేపడుతుందా? అని ప్రశ్నించారు. సింగపూర్ మంత్రి ఏ ¬దాలో రాజధాని నిర్మాణ సంస్థతో సంతకాలు చేశారు, ఆయన పర్యటనపై విదేశాంగ శాఖ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. రాజధాని పరిసర ప్రాంతాలలోని భూములు కారు చౌకగా సింగపూర్ కంపెనీలకు కట్టబెట్టారని మండిపడ్డారు. అమరావతి నిర్మాణం కోసం గవర్నర్ పేరుతో అక్రమంగా పదిహేను వందల జీవోలు విడుదల చేశారని, వీటిపై గవర్నర్‌ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కలవనున్నదని ధర్మాన స్పష్టంచేశారు. ఈ జీవోలన్నింటిపై కేంద్రం దృష్టి సారించాలని ఆయన కోరారు. చంద్రబాబు ప్రభుత్వం నవనిర్మాణ దీక్షలతో ప్రజలను అపహాస్యం చేస్తుందని ఎద్దేవచేశారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులకు డబ్బులు లేవంటున్న చంద్రబాబు నవ నిర్మాణ దీక్షలను పెట్టడానికి డబ్బులెక్కడవవని ప్రశ్నించారు. బాబు వస్తే జాబు వస్తుందని గత ఎన్నికల్లో యువత, మహిళలు పెద్ద ఎత్తున ఓట్లు వేసి గెలిపించారని, బాబు అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అవుతున్నా కనీస ఉద్యోగులు కూడా ఇవ్వకపోయారని, నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. బాబు నాలుగేళ్ల పాలనలోనే టీడీపీ నేతల కబ్జాలు, ఇసుక మాఫియాకే పెద్దపీట వేశారని ఆరోపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఏపీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. ముఖ్యంగా రైతులకు ఎంతో మేలు చేకూర్చారని, కానీ నేడు చంద్రబాబు రైతులను విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు తెదేపా నాలుగేళ్ల పాలనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని 2019లో తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు.