తుమ్మల రాజు రెడ్డి నిరవధిక నిరాహార దీక్ష భగ్నం
అమర నిరాహార దీక్ష చేస్తున్న తుమ్మల రాజిరెడ్డి అక్రమ అరెస్టును ఖండిస్తున్న వెంకటరత్నం
పినపాక నియోజకవర్గం జూలై 21 (జనం సాక్షి): సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కరించాలని గోదావరిఖని ఆర్జీవంలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న తుమ్మల రాజారెడ్డి అక్రమంగా అరెస్టును మణుగూరు ఏరియా కార్యదర్శి వల్లూరు వెంకటరత్నం ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కార్మిక సమస్యలను పరిష్కరించలేక విఫలమైందన్నారు.కార్మిక ఉద్యమాలకు పోరాటానికి సింగరేణి యాజమాన్యా గుండెల్లో వణుకు పుట్టిందన్నారు. సింగరేణి కార్మికుల సొంతింటి కలను నెరవేర్చేందుకు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజ రెడ్డిని అరెస్టు చేయడం ప్రభుత్వం చేతగాని తనమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థల ద్వారా తీసుకున్నా వేల కోట్ల రూపాయలు చెల్లించలేక రాజారెడ్డి అరెస్టులకు పాల్పడిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును సొంతింటి కల హామీని అడగడం నేరమా.. అని ప్రశ్నించారు.కార్మిక సమస్యలపై గాంధేయ మార్గంలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న రాష్ట్ర అధ్యక్షులను అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. కార్మిక సమస్యలు పరిష్కార అయ్యేవరకు ఉద్యమాలను ఎవరు ఆపలేరు అన్నారు నిరంతరం పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో డివిజన్ అధ్యక్షులు టీవీ ఎం.వి ప్రసాద్ నంద ఈశ్వరరావు మాచార లక్ష్మణరావు వై రామ్మూర్తి టీ లక్ష్మణరావు బొల్లం రాజు విల్సన్ తదితరులు పాల్గొన్నారు.