అమెరికాలో కాల్పుల కలకలం

1

– పోలీసులపై దుండగుల ఫైర్‌

లూసియానా,జులై 17(జనంసాక్షి): అమెరికాలో మరోసారి తుపాకుల మోత మోగింది. లూసియానాలోని బేటన్‌ రోజ్‌ సవిూపంలో ఒక దుండగుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు పోలీసు అధికారులు ప్రాణాలు కోల్పోయారు. కాల్పుల్లో మరో నలుగురు పోలీసు అధికారులు గాయపడినట్టు సమాచారం. అసాల్ట్‌ రైఫిల్‌తో ఒక వ్యక్తి తిరుగుతున్నట్టు సమాచారం రావడంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. వారిని చూసిన దుండగుడు కాల్పులు జరిపాడు. కొద్ది రోజుల క్రితం లూసియానాలోనే అల్టాన్‌ స్టెర్లింగ్‌ అనే నల్లజాతీయుడిని పోలీసులు కాల్చిచంపడంతో దేశమంతా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. డాలస్‌ నగరంలో జరిగిన ర్యాలీలో ఒక వ్యక్తి పోలీసులపై జరిపిన విషయం తెలిసిందే.