అమెరికాలో ముస్లింల ప్రవేశాన్ని నిషేధించాలన్న వ్యాఖ్యలపై మాలాలా తీవ్ర అభ్యంతరం

2

– జాతి విద్వేశాలను రెచ్చగొట్టేలా ఉన్నాయి

న్యూఢిల్లీ,డిసెంబర్‌18(జనంసాక్షి): అమెరికాలో ముస్లింల ప్రవేశాన్ని నిషేధించాలన్న వ్యాఖ్యలపై శాంతి నోబెల్‌ నోబెల్‌ పురస్కార గ్రహీత మలాలా తీవ్ర అభ్యంతరం తెలిపింది.అమెరికాలో ముస్లింల ప్రవేశాన్ని నిషేధించాలని డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలను మలాల ఖండించారు. ఇటువంటి వ్యాఖ్యలు జాతి విద్వేశాల్ని రెచ్చగొడతాయని అన్నారు. ఉగ్రవాదాన్ని అణిచివేయాలంటే నాణ్యమైన విద్యా విధానాన్ని తీసుకురావాలన్నారు. డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ తరుఫున పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.  శాన్‌ఫ్రాన్సిస్కోలో ఇటీవల ఓ ముస్లిం జంట ఆత్మాహుతి దాడులకు పాల్పడి 14 మందిని చంపేశారు. ఈ సంఘటనను ఉద్ధేశించి డొనాల్డ్‌ పై వ్యాఖ్యలను చేశారు. కాగా, డొనాల్డ్‌ వ్యాఖ్యలను మలాలా తప్పుపట్టారు.  ఐఎస్‌ లేదా ఇతర ఉగ్రవాద భావజాలన్ని నిరోదించాలంటే విద్యారంగాన్ని పటిష్టంగా ముందుకు తీసుకుని పోవాలని నోబెల్‌ పురస్కార గ్రహీత మలాలా యూసఫ్‌జాహీ అభిప్రాయపడ్డారు. ఇదొక్కటే ఉగ్రవాద మూలాలను తిప్పికొట్టగలదన్నారు. విద్యతోనే ఉగ్రవాదుల మానసిక స్థితిగ తులను మార్చే అవకాశం ఉంటుందని అభిప్రాయ పడ్డారు. మలాలా తండ్రి జియావుద్దీన్‌ యూసఫ్‌జాహీ కూడా ఆమె వ్యాఖ్యలను మద్ధతు తెలిపారు. ఇదిలా ఉండగా, బాలికల విద్యా విధానాన్ని ప్రోత్సహించడంతో పాటు శాంతి స్థాపనకు కృషి చేస్తున్నందుకుగానూ 2012లో ఆమెపై తాలిబన్లు దాడికి పాల్పడ్డారు. దీంతో ఆమె అప్పటి నుంచి బ్రిటన్‌లోనే ఉంటున్నారు.