అమెరికా వత్తిడికి తలొగ్గిన పాక్..
– ఉగ్రవాద సంస్థ అధినేత హఫీజ్ అరెస్ట్
లా¬ర్, నవంబర్30(జనంసాక్షి) : లా¬ర్ కోర్టు ఆదేశాలతో గృహనిర్బంధం నుంచి విడుదలచేసిన ముంబై మారణ¬మం సూత్రధారి, లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థ అధినేత హఫీజ్ సయీద్‌ను అమెరికా ఒత్తిడితో పాకిస్థాన్ ప్రభుత్వం మరోసారి గురువారం అదుపులోకి తీసుకుంది. అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్‌ను విడుదల చేసిన మరుక్షణమే అమెరికా ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాక్ ప్రభుత్వం పునరాలోచించింది. ఇతర నేరాల్లో హఫీజ్‌ను అదుపులోకి తీసుకోకపోతే అంతర్జాతీయ వేదికపై దౌత్యపరమైన సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ అంతర్జాతీయ తీవ్రవాదిని తక్షణమే అరెస్ట్ చేసి విచారించకపోతే పాక్‌తో ద్వైపాక్షిక సంబంధాలను అంతర్జాతీయ సమాజం పున:సవిూక్షిస్తుందని హెచ్చరించింది. అంతేకాదు సయీద్‌పై ఎలాంటి చర్యలు తీసుకోని పక్షంలో పాకిస్థాన్ తన భూభాగంలో ఉగ్రవాద సంస్థలపై ఉదాసీనంగా వ్యవహరిస్తుందని బలంగా నమ్ముతామని స్పష్టం చేసింది. హఫీజ్‌ను భయంకరమైన తీవ్రవాదిగా పేర్కొంటూ 2008 డిసెంబరులో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఓ ప్రత్యేక తీర్మానం ద్వారా ప్రకటించిన విషయాన్ని గుర్తుచేసింది. ఓ భయంకర ఉగ్రవాదిని విడుదల చేసిన పాక్‌ను ఇప్పటికీ నాన్-నాటో మిత్రదేశంగా ఎలా పరిగణనిస్తున్నారో అంతుబట్టడం లేదని అమెరికా విదేశీ వ్యవహారాల కౌన్సిల్ అధ్యక్షుడు రిచర్డ్ హాస్ పేర్కొన్నారు. రిచర్డ్ హాస్ ఇలా వ్యాఖ్యానించిడానికి ముందు రోజే పాకిస్థాన్‌ను ఇక మిత్రపక్షంగా పరిగణించరాదని అమెరికాకు చెందిన
ఉగ్రవాద వ్యతిరేక పోరాట నిపుణుడు పేర్కోవడం గమనార్హం. 26/ 11 ముంబై దాడులు జరిగి తొమ్మిదేళ్లు పూర్తయినా ప్రధాని సూత్రధారి స్వేచ్ఛగా తిరుతున్నాడని, పాక్‌ను నాన్-నాటో మిత్రపక్షం ¬దా నుంచి తప్పించడానికి ఇదే సరైన సమయమని అమెరికా భద్రతాధికారి, దక్షిణాసియా తీవ్రవాద వ్యతిరేక పోరాట నిపుణుడు బ్రూస్ రైడెల్ వ్యాఖ్యానించారు. హఫీజ్ సయీద్ విడుదలతో తమ దేశానికి దౌత్యపరమైన, ఆర్థికపరమైన సమస్యలు ఎదురవుతాయని పాక్ ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు వ్యాఖ్యానించారు.