అమ్మఒడి భాగంగా గర్భవతులను పరీక్షలు

రామారెడ్డి    జులై
  జనంసాక్షీ :
అమ్మఒడి  భాగంగా గర్భవతులను పరీక్షలు నిర్వహించినట్లు  పీఎచ్ సి డాక్టర్ షాహిద్ అలీ తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ,
రామరెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో అమ్మఒడి కార్యక్రమంలో భాగంగా మొదటి సోమవారం  26 మంది గర్భవతులకు పరీక్షలు చేశామన్నారు.  ప్రతి నెలలో  ప్రతి సోమవారం పరీక్షలు. చేయించుకుని ఆరోగ్యంగ గర్బవతులు  ఉండాలని అన్నారు.  అన్ని రకాల పరిక్షలు  ప్రభుత్వ  ఆసుపత్రిలో నే చేయబడుతాయని అన్నారు అంతే కాకుండా గర్భవతులు ఇంటినుండి తీసుకు వచ్చి మల్లి  వారిని ఇంటి వద్దకు  వదిలెందుకు సౌకర్య వంతంగా 102 ప్రభుత్వ అంబులెన్స్ ను ప్రభుత్వం ఏర్పాటు చెసిందని అన్నారు.  ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం చేయించుకున్న వారికి కేసీఆర్ కిట్ లు  అందించ బడునని అన్నారు.  ప్రతి ఒక్కరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేసుకోవచ్చునని అన్నారు.  ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది , దోమలశ్రీధర్ , జ్యోతీ, భువనేశ్వరి, మహేశ్వరి, గంగమని, లలిత,  లు మరియు అన్ని సబిసెంటర్స్ ల ఏఎన్ఎంఆలు ,ఆశ కార్యకర్తలు గర్భవతులు పాల్గొన్నారు.
Attachments area