అమ్మపాలు…అమృతం
అమ్మ పాలు
అమృతబాండం
అద్వితీయ ఔషధం
అపూర్వ శక్తి సంపన్నం
బిడ్డకు ఆది ఆహారం
తొలి దేదివ్య ఔషధం
మొదటి శక్తి తరంగం
జీవితానికి శుభారంభం
భగవంతుడు ఇచ్చిన వరం
ప్రకృతి ప్రసాదించిన భాగ్యం
శారీరక దృఢతకు ఆధారం
మనోపరిపక్వతకు మూలం
సంపూర్ణ స్వస్థకు సహేతుకం
పౌష్టికాహార సమ్మేళనం
పోషకవిలువల సమాహారం
ఊపిరులు నిలిపే సంజీవనం
తల్లీబిడ్డల బంధాల సాంగత్యం
కృత్రిమ పాలు ఏవైనా సరే
అమ్మపాలకు సరితూగవు
తల్లి పాలు సేవించిన
శిశువు సర్వత్రా సంక్షేమం
లేదంటే సుస్థితో సహజీవనం
అందుకే
తల్లి పాల సంస్కృతిని
సామాజిక బాధ్యతగా తలచి
మనవంతు సహకారం అందించి
స్వస్తత తరాలను తీర్చిదిద్దుదాం
శక్తివంత సమాజాన్ని ప్రతిష్టించి
భారతం బలీయమని చాటుదాం
అమ్మపాల వారోత్సవాలను
దిగ్విజయవంతంగా జరుపుదాం
“””””””””””
(ఆగస్టు 1 నుండి తల్లి పాల వారోత్సవాల సందర్భంగా…)
కోడి
Mbl no :9573929493