అమ్మహస్తం ప్రారంభించిన ఎమ్మెల్యే
అశ్వారావుపేట: ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన రూ. 185కే తొమ్మిదిరకాల సరకులను అందిచే అమ్మహస్తం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వగ్గెల మిత్రసేన అశ్వారావుపేటలో ప్రారంభించారు. నియోజకవర్గంలోని 6 మండలాలనుంచి లబ్ధిదారులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమానికి హజరయ్యారు.ఈ కార్యక్రమంలో తహశీల్దార్ వెంకారెడ్డి,పీఏసీఎన్ అధ్యక్షుడు చెన్నకేశవరావు పాల్గొన్నారు.