అమ్మ హస్తం పై కావాలనే దుష్ప్రచారం : మంత్రి శ్రీధర్‌ బాబు

హైదరాబాద్‌, జనంసాక్షి: రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘అమ్మహస్తం’ పథకంపై కావాలనే కొందరు క దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి శ్రీధర్‌ బాబు అన్నారు. అమ్మహస్తం కార్యక్రమంలోని లోపాలను సవరిస్తామని తెలిపారు. అమ్మహస్తం కోసం జిల్లాకొక అధికారిని ఇవ్వాలని సీఎస్‌ను కోరామని చెప్పారు. అమ్మహస్తంలో పొరపాట్లకు సంబధిత అధికారులదే బాధ్యత అని తేల్చిచెప్పారు. అమ్మహస్తమో………. మాయ హస్తమో….. ప్రజలే తీర్పు ఇస్తారని పేర్కొన్నారు.