అయినా 14శాతం లోటు వర్షపాతం

అధికారులతో సిఎం చంద్రబాబు టెలి కాన్ఫరెన్స్‌

అమరావతి,ఆగస్ట్‌13(జ‌నం సాక్షి ): మూడ్రోజులుగా వర్షాలు కురుస్తున్నా 14 శాతం లోటు వర్షపాతం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అనుకున్న మేరకు ఇంకా వర్షాలు పడలేదన్నారు. సోమవారం నీరు – ప్రగతి, వ్యవసాయంపై సీఎం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఎనిమిది జిల్లాల్లో లోటు వర్షపాతం ఉందన్నారు. ఏటా జులైలో వర్షాలు తగ్గడం, ఆగస్టులో మళ్లీ పెరగడం చూస్తున్నామని చెప్పారు. ప్రజలకు నీటి భద్రత ఇవ్వాలని అధికారులకు సీఎం సూచించారు. ఉపరితల జలాలు, భూగర్భజలాలు సద్వినియోగం చేసుకోవాలని, సమర్థ నీటి నిర్వహణ ద్వారా నీటి కొరత అధిగమించాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. టెలికాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.ఇదిలావుంటే ముఖ్యమంత్రి చంద్రబాబుతో రాజధాని రైతులు సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భూ సవిూకరణలో భూములు ఇచ్చిన రైతుల సమస్యలపై సీఎంకు రైతులు వినత పత్రం అందజేశారు. గ్రామ కంఠాల విషయంలో అధికారుల ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. గ్రామ కంఠాలతో పాటు రైతుల సమస్యలపై దృష్టి సారించాలని సీఎం చంద్రబాబుకు రైతులు విజ్ఞప్తి చేశారు.

 

తాజావార్తలు