అయ్యప్ప భక్తులకు శుభవార్త
విజయవాడ: కేరళలోని అయ్యప్ప ఆలయానికి వెళ్లే భక్తులకు వివిధ సౌకర్యాల కల్పనను ట్రావెన్కూర్ ఆలయ బోర్డు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 5ఎకరాలు కేటాయించినట్లు దేవాదాయశాఖ మంత్రి రామచంద్రయ్య విజయవాడలో తెలిపారు. ఈ స్థలంలో అయ్యప్ప భక్తులకు రూ.26కోట్లతో డార్మెటరీ, ఆసుపత్రి, సమాచార కేంద్రం, పార్కింగ్ స్థలం తదితర వసతులు ఏర్పాటు చేస్తామని చెప్పారు.