అయ్యా…. మేము (వీఆర్ఎలము) చేసిన తప్పు పని ఏంటి??

రామారెడ్డి   సెప్టెంబర్  25   (జనంసాక్షీ)  :
అయ్యా…. మేము (వీఆర్ఎలము) చేసిన తప్పు పని ఏంటి??అని రామారెడ్డి మండల మండల వీఆర్ఎల సంఘం అద్యక్షుడు శ్రీనివాస్ ఆవేదన వ్యక్తంచేశారు. నిరసనలో భాగంగా  ఆయన మాట్లాడుతూ,  సీఎం కేసీఆర్  సారు  ప్రగతిభవన్, అసెంబ్లీ వేదికగా ఇచ్చిన  హామీలను నమ్మి ఇంత కాలం ఓపిక తో ఎదురు చూడటమా!! లేదా ? మీరు ప్రభుత్వ పథకాలు అమలు చేస్తే వీఆర్ఎలమైన మేము అమ్మా… మీకు కళ్యాణ లక్ష్మి చెక్ వచ్చింది. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ వచ్చిందని , ఆఖరికి మీ బర్రె నో దుడ్డే నో సచ్చిపోతే చెక్ వచ్చింది..లేక వానలకు ఇండ్లు కూలిన చెక్ లు..ఎలా ఎన్నో రకరకాల  ఫలానా చోట మీటింగ్ ఉంది అని దగ్గరుండి తీసుకెళ్లి  వెళ్ళాక అక్కడ మీ ప్రజా ప్రతినిధులకు కుర్చీ లు మోసి,  మీరు తాగే నీళ్ళ డబ్బాలు మోసి మీకు ప్రజలను దగ్గర చేయడమా?  అని అన్నారు. గ్రామాలలో ఆర్థిక సమస్య లతో కానీ, కుటుంబ సమస్యలతో కానీ.. మరే ఇతర కారణాలతో ఎవరైనా చనిపోతే పది నిమిషాలలో అక్కడికి చేరుకోవాలి. ఇటు పోలీసులతో అటు రైతు బీమా కు అర్హుడా కదా అని దగ్గర ఉండి పనులు నిర్వహించిన,  ఇతరులు చచ్చిన నుండి వాళ్ళ దహన సంస్కారాలు అయ్యేదాకా నిత్యం ప్రజలతో మమేకమై ఉండటమేనా అని ప్రశ్నించారు. ఓటరు నమోదు , పోలియో చుక్కలు, కరోనా టైం లో మా బాధ చెప్పేది కాదన్నారు.   ఒకరు అడుగుతారు మీ ఊరి లో ఎన్ని వినాయక విగ్రహలు, ఎన్ని మైక్ లు పెట్టారు అని అడుగుతారు. అందరు ఆఫీస్ లో ఉండి మాకు ఆర్డరులు వేసేవాల్లే ! అయిన మేము ఓపికతో మాబాద్య తగా పనులు చేయడమా..?
నాయకులు పోలీసు అధికారులు ఏఊరి లో ఏమైన కార్యక్రమాలు ఉంటే ఎంత మంది వచ్చారో అంత మంది వీఆర్ఎలకే పని చెప్తారని గుర్తు చేశారు.  ఎందుకంటే ఎవరికి పని చెప్పినా ఎవరు చేయరు వాళ్ళ అహం దెబ్బతింటుంది కదా అని అన్నారు. వీఆర్ఎలకు ఉన్నంత మంది బాస్ లు ఎవరికి ఉండరేమో అనిపిస్తుందని అన్నారు.  తెల్ల చొక్కా వేసుకున్న ప్రతి ఒక్కరూ వీఆర్ఎలను బెది రించేవారు అవుతున్నా‌ని అన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభుత్వం ఇచ్చే జీతం వీఆర్ఎల భోజనం , పెట్రోలుకే సరిపోదన్నారు. వాళ్ళు పిలిచారు. వీళ్ళు పిలిచారు అని తింపి తింపీ పీప్పి చేస్తారు. అధికారులు అని అన్నారు. అస్సలు కథ చూస్తేనేమో తాత్కాలిక ఉద్యోగులం అని గుర్తుకొచ్చింది సారు అని అన్నారు. అధికారులు పెన్ను పట్టి రాసే ఉద్యోగుల కంటే వీఆర్ఎలు నేరుగా ప్రజలకు సేవ చేసి సీఎం కేసీఆర్ సారు  పేరు కాపడుతున్నము. అని అన్నారు. సీఎం సారు వీఆర్ఎలను గుర్తించినట్లే గుర్తించి  విస్మరిస్తున్నార ని ఆవేదన వ్యక్తం చేశారు. వీఆర్ఎలకు పేస్కేలు అర్హులకు ప్రమోషన్లు జారీ చేస్తే ,  వారసులకు ఉద్యోగాలు కల్పించడం వల్ల   జీతానికి రెట్టింపు కష్టమైన ఇష్టంగా చేస్తామన్నారు. నేటికీ సమ్మె 63 రోజులకు చేరుకుందన్నారు.  ఈ చిన్న ఉద్యోగుల మీద ఎందుకు మీకు వివక్ష సారు అని ప్రశ్నించా రు. దాదాపు 30 మందికి పైగా వీఆర్ఎలు ఆత్మ బలిదానాలు, వివిధ రకాల ఇబ్బందులతో చనిపోయారని అన్నారు. బంగారు తెలంగాణ లో ఆత్మ బలిదానాలు అవసరమా ? సారు అని అన్నారు. మూడు నెలలుగా జీతాలు లేక ఇబ్బంది పడుతున్నామని అన్నారు. . బతుకమ్మ పండుగ దసరా నవరాత్రులు ఉన్నాయి.. ఆడ పిల్లల గోస మీకు వద్దు సారు అని గుర్తు చేశారు. వీఆర్ఎల క్రమబద్దీకరణ, మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని పత్రిక ముఖంగా అడుగుతున్నాం  సారు అని అన్నారు. వీఆర్ఎల మీద కోపం ఎందుకు సీఎం సారు అని అన్నారు.
Attachments area