అరుణ్ జైట్లీ తప్పుకో..
– ఆయన నివాసం వద్ద ఆప్ కార్యకర్తల ఆందోళన
న్యూఢిల్లీ,డిసెంబర్23(జనంసాక్షి):కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లికి వ్యతిరేకంగా ఆమ్ ఆద్మి పార్టీ పోరాటం పెంచింది. జైట్లి రాజీనామా చేయాలంటూ డిల్లీలో ఆయన ఇంటిని ఆప్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. ఆప్ కార్యకర్తలను చెదరగొట్టడానికి పోలీసులు వాటర్ కానన్ ప్రయోగించారు. ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ కు సంబంధించిన నిదుల దుర్వినియోగంలో జైట్లి పాత్ర ఉందని వారు ఆరోపిస్తున్నారు.దీనిపై ఇప్పటికే జైట్లి ముఖ్యమంత్రి కేజీవ్రాల్ పై పరువు నష్టం దావా కూడా వేశారు. ఇదిలా ఉండగా అరుణ్ జైట్లికి శివసేన మద్దతు ఇచ్చింది.ఆమ్ ఆద్మి పార్టీ కేజీవ్రాల్ బెలూన్ వంటివాడని, ఎప్పుడో అది పేలుతుందని హెచ్చరించింది. అరుణ్‌జైట్లీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన నివాసం వద్ద ఆప్ నేతలు, కార్యకర్తలు ఆందోళన భారీగా తరలిరావడంతో వారిని చెదర గొట్టేందుకు పోలీసులు వాటర్‌కెనాన్‌లు ఉపయోగించారు. అయినప్పటికీ ఆప్ కార్యకర్తలు వెనక్కి తగ్గకుండా జైట్లీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దిల్లీ జిల్లా క్రికెట్ సంఘంలో అవినీతి చోటుచేసుకుందని, ఇందుకు అరుణ్‌జైట్లీ బాధ్యుడంటూ గత కొద్ది రోజులుగా దిల్లీ సీఏం కేజీవ్రాల్, ఆప్‌నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో కేజీవ్రాల్ సహా ఐదుగురు ఆప్ నేతలపై అరుణ్‌జైట్లీ దిల్లీ హైకోర్టులో పరువునష్టం దావా వేయగా… వారికి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆప్ కార్యకర్తలు అరుణ్‌జైట్లీ ఇంటి వద్ద ఆందోళన చేపట్టారు. డీడీసీఏలో ఆర్థిక అవకతవకల వివాదం పెనుదుమారం రేపుతుంది. కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లికి వ్యతిరేకంగా ఆమ్ ఆద్మి పార్టీ పోరాటం పెంచింది. జైట్లి రాజీనామా చేయాలంటూ డిల్లీలో ఆయన ఇంటిని ఆప్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది.
ఇప్పటికే విచారణ జరిగిందన్న రాథోడ్
ఢిల్లీ జిల్లా క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) నిధుల దుర్వినియోగం వ్యవహారంపై ఇంతకుముందే విచారణ జరిగిందని కేంద్ర మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ తెలిపారు. ఎటువంటి అక్రమాలు జరగలేదని విచారణలో తేలిందని చెప్పారు. తన ముఖ్యకార్యదర్శిపై వచ్చిన అవినీతి ఆరోపణలకు సమాధానం చెప్పకుండా అసభ్య పదజాలంతో అరవింద్ కేజీవ్రాల్ ఎదురుదాడి చేస్తున్నారని విమర్శించారు. అవినీతిపరుడైన అధికారిని దగ్గర పెట్టుకుని అవినీతిరహిత పాలన అందిస్తామని కేజీవ్రాల్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీపైనే కాకుండా ఆయన కుటుంబంపైనా అసభ్య పదజాలంతో ఢిల్లీ సీఎం విమర్శలు చేశారని రాథోడ్ ఆరోపించారు. డీడీసీఏ ఆర్థిక అవకతవకల వ్యవహారంలో తనపై ఆరోపణలు చేసిన కేజీవ్రాల్, మరో ఐదుగురు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలపై అరుణ్ జైట్లీ పరువునష్టం దావా వేసిన సంగతి తెలిసిందే.