అర్చకులకు ఐదు లక్షల ఆరోగ్యబీమ అమలుచేయాలి
చొప్పదండి, ఆగస్టు 24 (జనం సాక్షి) :ధూపదీప నైవేద్య అర్చకులకు ఐదు లక్షల ఆరోగ్యబీమ, ఐదు లక్షల ప్రమాదబీమా అమలుజేసేలా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకవేళ్ళాలని చొప్పదండి ఎమ్మేల్యే సుంకే రవిశంకర్ కు రాష్ట్ర ధూప దీప నైవేద్య అర్చక సంఘం ఉపాధ్యక్షుడు సింహాచలం ప్రభాకరచార్యులు ,జిల్లా అధ్యక్షుడు నాగరాజు సంపత్ కుమారాచార్యుల ఆధ్వర్యంలో అర్చకుల వినతిపత్రం అందజేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. పేద అర్చకులకు గృహలక్ష్మి పథకంలో ప్రాధాన్యత ఇవ్వాలని,దేవాదాయ ధర్మాదాయ శాఖ గుర్తింపు కార్డులు అందజేయాలని కోరగా, ప్రభుత్వం దృష్టికి తీసుకవేళ్ళి..అన్ని సమ్యసలకు పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తానని ఎమ్మేల్యే హామీ ఇచ్చారు. నియోజకవర్గంలోనే అత్యధిక ఆలయాలకు ధూప దీప నైవేద్య పథకం మంజూరైందని ఎమ్మెల్యే గుర్తుచేశారు.. నియోజకవర్గంలోని వంద ఆలయాల అభివృద్ధి కి రూ పది లక్షల చొప్పున మంజూరు చేయించానని పేర్కొన్నారు. కొండగట్టు క్షేత్రాన్ని నభూతో నభవిష్యతి అన్న రీతిలో అభివృద్ధి చేయటానికి ప్రణాళిక రూపొందించినట్లు అర్చకులకు తెలియజేశారు.నియోజకవర్గస్థాయి అర్చక సదస్సు ఏర్పాటు చేసుకోని సాదకబాదకలు తెలుసుకుందామని అన్నారు.ఈ కార్యక్రమంలో డిడిఎన్ చొప్పదండి మండలం అధ్యక్షుడు సింహాచలం మురళీమోహనచార్యులు.కామోజ్వాల శ్రీనివాస్ శర్మ, జనగామసత్యనారాయణ,.పవన్ కిషోర్ శ్రీపతి తదితరులు పాల్గొన్నారు.