అర్థరాత్రి బస్సులో మంటలు
డ్రైవర్ అప్రమత్తతో తప్పిన ముప్పు
నల్గొండ,డిసెంబర్2(జనంసాక్షి): హైదరాబాద్ నుంచి ఒంగోలు వెళ్తున్న ఓ బస్సులో ఆదివారం అర్ధరాత్రి నల్గొండ జిల్లా కేంద్రంలోని చర్లపల్లి కూడలి వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గుర్తించిన డ్రైవర్.. ప్రయాణీకులను అప్రమత్తం చేసి, త్వరగా బస్సు దిగమన్నాడు. ప్రయాణీకులంతా గబగబా బస్సు దిగారు. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 40 మంది ప్రయాణీకులు ఉన్నారు. ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇంజన్ లోపం వల్లే మంటలు చెలరేగినట్లు అంచనా వేస్తున్నారు. కాగా, బస్సు.. ప్రయాణీకులు చూస్తుండగానే పూర్తిగా దగ్దమైంది. ప్రమాదానికి గురైన బస్సు గుంటూరు గాయత్రి ట్రావెల్స్‌కు చెందినదిగా తెలిసింది.