అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పింఛన్

పంచలింగాల్ లో మీతో నేను కార్యక్రమంలో ఎమ్మెల్యే మెతుకు ఆనంద్.
– మీతో నేను కార్యక్రమముతో ప్రజలో మంచి స్పందన.

మర్పల్లి సెప్టెంబర్ 20 (జనంసాక్షి)
అర్హత కలిగిన వారికి ప్రతి ఒక్కరికి పెన్షన్ అందిస్తామని వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు. మంగళవారం రోజు మర్పల్లి మండల పరిధిలోని పంచలింగాల్ గ్రామంలో మీతో నేను కార్యక్రమంలో పాల్గొన్న వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్. ఉదయం 7 గంటలకే గ్రామానికి చేరుకొని గ్రామంలోని పలు కాలనీలు తిరిగి ప్రజలకు ఉన్న సమస్యలను ప్రజలకు అడిగి తెలుసుకున్నారు. తాగునీటి ట్యాంకును శుభ్రం చేయడం లేదని ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు, ఎమ్మెల్యే ప్రతి నెలకి మూడు సార్లు ట్యాంకును శుభ్రం చేయించాలని గ్రామ కార్యదర్శిని ఆదేశించారు. గ్రామంలో కొన్ని వార్డులో నీటి సమస్యలు ఎక్కువగా ఉందని ప్రజలు ఎమ్మెల్యేకు విన్నపించుకున్నారు. గ్రామంలో నీటి సమస్యలు లేకుండా చేయాలని, ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నల్ల కనెక్షన్ ఇచ్చి, గేట్ వాల్ ఏర్పాటు చేసి, ఎక్కడ కూడా లీకేజీలు లేకుండా చూసి ప్రజలకు సరిపడా నీటిని అందించాలని మిషన్ భగీరథ అధికారులకు చెప్పారు. గ్రామ మధ్యలో ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్ఫారం ను ఊరి బయటకు మార్చాలని, గ్రామ మధ్యలో మరియు పంట పొలాల్లో వేలాడుతున్న విద్యుత్ వైర్లను సరిచేయాలని, గ్రామంలో లో వోల్టేజ్ సమస్యను పరిష్కరించి, నూతన ట్రాన్స్ఫారాలు ఏర్పాటు చేసి గ్రామానికి అవసరమైన చోటా నూతన ట్రాన్స్ఫర్మర్ ఏర్పాటు చేసి, విద్యుత్ సమస్యలను పూర్తిగా పరిశీలించాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మెతుకు ఆనంద్. మాట్లాడుతూ గ్రామంలో ఉన్న సమస్యల పరిష్కారం కొరకే మీతో నేను కార్యక్రమం చేపడుతున్నానని, గ్రామంలో ఉన్న సమస్యలను తెలుసుకోవడం ముఖ్య ఉద్దేశమని ఆయన అన్నారు. అనంతరం పంచలింగాల్ గ్రామంలోని అప్పగారి ఆశ్రమంలో షెడ్డును ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి మధుకర్, వైస్ ఎంపీపీ మోహన్ రెడ్డి, కో ఆప్షన్ సభ్యులు సోయల్ షరీఫ్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు నాయక్ గౌడ్, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మార్వో శ్రీధర్, ఎంపీడీవో జనార్ధన్ రెడ్డి, అధికారులు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, తదితరులు పాల్గొన్నారు.