అర్హత గల రైతులందరూ రైతు బీమాకు దరఖాస్తు చేసుకోవాలి.
-18 నుండి 59 సంవత్సరాలు లోపు వారికి మాత్రమే
-ఆగస్టు 5న ఆఖరి తేదీ
జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి.
మిర్యాలగూడ, జనం సాక్షి.
రైతు సంక్షేమం,శ్రేయస్సు కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న కృషి అద్వితీయమని జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు చింత రెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని యాదగిరిపల్లి గ్రామంలో రైతు బీమా పథకం గురించి ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆరుగాలం కష్టించి పనిచేసే రైతు జీవితానికి భీమా కల్పించిన మొట్టమొదటి ప్రభుత్వం తెలంగాణని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులందరికీ ప్రతి ఒక్క రైతుకు బీమా పథకం కోసం జీవిత బీమా సంస్థకు రూ 3487 రూపాయలు చొప్పున తెలుస్తుందని తెలిపారు.ఇప్పటి వరకు రైతు బీమా పథకాన్ని పొందనివారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అందుకు అర్హతగా వారి పేర్లు మీద పట్టా పాస్ పుస్తకం కలిగి ఉండి 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాలు లోపు గలవారు అర్హులని వివరించారు. వెంటనే రైతులందరూ పట్టా, పాస్ బుక్కులు, ఆధార్ కార్డు తో మండల వ్యవసాయ అధికారి కార్యాలయం లో నమోదు చేసుకోవాలని సూచించారు. ఇప్పటికీ యాద గారి పల్లి గ్రామంలో 190 మంది రైతులు అన్ని అర్హతలు ఉండి కూడా దరఖాస్తు చేసుకోలేదని అన్నారు. అదేవిధంగా జిల్లావ్యాప్తంగా కూడా వేలాది మంది రైతులు రైతు బీమా పథకాన్ని పొందడం లేదని వారికి సరైన అవగాహన కల్పించి రైతు బీమా పథకంలో చేర్పించాలని రైతుబంధు సమితి బాధ్యులను ఆయన కోరారు. ఈ మధ్యకాలంలో కొందరు పేద రైతులు వివిధ కారణాల వలన మృతి చెందారని వారికి రైతు బీమా పథకం అందకుండా పోవడం విచారకరమన్నారు. ఇకపై భీమ ప్రయోజనాలను ప్రతి ఒక్క రైతు పొందేలా కృషి చేయాలన్నారు. ఆగస్టు 5వ తేదీ వరకు ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా రైతులు పూర్తి చేసిన దరఖాస్తు ఫారాన్ని చింత రెడ్డి శ్రీనివాస్ రెడ్డి స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దుండిగాల యాదమ్మ శ్రీనివాస్, ఏ ఈ ఓ. సైదా నాయక్, మాజీ సర్పంచ్ చింతరెడ్డి రవీందర్ రెడ్డి, గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు చిమ్మట ఎర్రయ్య, బంటు ఎల్లయ్య, గ్రామ బి ఆర్ ఎస్ శాఖ ప్రధాన కార్యదర్శి కొండేటి రవి, రైతులు చింత రెడ్డి కరుణాకర్ రెడ్డి, గువ్వల గురుస్వామి, బందారపు సత్యం, ఆవిడి రామస్వామి, జానపాటి శ్రీనివాస్, వెంకన్న, శీను తదితరులు పాల్గొన్నారు.